Site icon vidhaatha

టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గ‌డువు 24 వ‌ర‌కు పెంపు

Tenth Exams | వ‌చ్చే ఏడాది మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా ప‌ది ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు పొడిగిస్తూ అధికారులు ప్ర‌క‌ట‌న చేశారు.

షెడ్యూల్ ప్ర‌కారం ఫీజు గ‌డువు నిన్న‌టితో ముగిసిన‌ప్ప‌టికీ, విద్యార్థుల‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చారు. రూ. 50 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 5, రూ. 200 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 15, రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 29వ తేదీ లోపు చెల్లించొచ్చు.

Exit mobile version