విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం శ్రీ స్వామిఅమ్మ వార్ల తెప్పోత్సవంను నేత్రపర్వంగా నిర్వహించారు.
ఉదయం గర్భాలయంలో స్వామివారికి నిత్య అభిషేకాలు, నిత్య ఆరాధనలు, సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కొండపైన విష్ణు పుష్కరిణిలో చైత్ర శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు.
అనంతరం దిష్టిపూజ మంగళ హారతులు కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. స్వామి వారి ఒకరోజు ఉండి ఆదాయము 22 లక్షల 78, 250లుగా వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.