కారులో మంటలు.. కాలిపోయిన నోట్ల కట్టలు

ఎన్నికల వేళ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. శుక్రవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద ఓ కారు ఇంజన్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి

  • Publish Date - November 24, 2023 / 12:03 PM IST

విధాత: ఎన్నికల వేళ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. శుక్రవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద ఓ కారు ఇంజన్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో కారు వదిలి పరారయ్యారు.


ఈ ఘటనలో కారు డిక్కీలో ఉన్న నోట్ల కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన నగదును, కాలకుండా ఉన్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. కారులోని నగదు ఎవరిదన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మంటల్లో పాక్షికంగా దగ్ధమైన కారును మామునూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.