రిజర్వ్‌డ్ సీట్లతోనే అధికారంలోకి హస్తం
19ఎస్సీ సీట్లలో కాంగ్రెస్‌కు 15
12ఎస్టీ సీట్లలో కాంగ్రెస్‌కు 9
విధాత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్‌డ్ నియోకవర్గం సీట్లను ఎక్కువగా గెలుచుకోవడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 60 సీట్లకు మించి సాధించగలిగింది. 119నియోజకవర్గాల్లో 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మెజార్టీ మార్క్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి.
కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలిచిన ఎస్సీ, ఎస్టీలు గత 2014, 2018 ఎన్నికల్లోతెలంగాణ ఉద్యమ సెంటిమెంట్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఈ దఫా వారంతా తిరిగి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించడంతో మళ్లీ కాంగ్రెస్ అధికారాన్ని హస్తం చేసుకోలిగింది. 19ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో 15సీట్లలో చెన్నూర్, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూర్, ఆందోల్,, వికారాబాద్, అచ్చంపేట, నకిరేకల్, తుంగతుర్తి, వర్ధన్నపేట, మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లిలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
బీఆరెస్ పార్టీ కేవలం 4సీట్లలో చేవెళ్ల, జహిరాబాద్‌లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్, స్టేషన్ ఘన్‌పూర్ 3సీట్లలో మాత్రమే గెలిచింది.12ఎస్టీ నియోజకవర్గాల్లో 9నియోజకవర్గాల్లో ఖానాపూర్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా, ములుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. బీఆరెస్ కేవలం 3 సీట్లు ఆసిఫాబాద్, బోథ్, భద్రాచలంలలో మాత్రమే గెలిచింది.
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ సీట్లలో మెజార్టీ సాధించడంతో బీఆరెస్ ఘన విజయం అందుకుంది. గత ఎన్నికల్లో 19 ఎస్సీ నియోజకవర్గాలకుగాను బీఆరెస్ పార్టీ 16చోట్ల విజయం సాధించింది. 2 కాంగ్రెస్, 1టీడీపీ గెలిచింది. 12ఎస్టీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో బీఆరెస్ గెలిచింది. 5 స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలువడం ఈ సందర్భంగా గమనార్హం.