విధాత : సీఎం కేసీఆర్ ఓడిపోతారని ఆ మొక్క ముందే చెప్పేసిందట…ఇదే ముచ్చట ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముంగిట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికలలో విజయ సాధన కాంక్షతో గతంలో మాదిరిగా ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనవాయితీగా సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో రాజశ్యామల యాగం చేశారు. అనంతరం కేసీఆర్ సెంటిమెంట్‌గా మహాగని మొక్కను అడవి నుంచి తెప్పించి తెలంగాణ సచివాలయంలో నాటించారు.
అయితే ఆ మొక్క సంరక్షణకు అటవి, ఉద్యాన వన శాఖల అధికారులు ఎన్ని జాగ్రత్తలు పాటించినా అది ఎండిపోయింది. మహాగని మొక్క ఎండిపోవడం కేసీఆర్ ఓటమికి ముందే ఇచ్చిన సంకేతాలన్న ప్రచారం ఇప్పుడు వైరల్ మారింది. అదేమి చిత్రమోగాని కరేబియన్ దీవుల్లో ఎక్కువగా పెరిగే మహాగని మొక్కను కేరళ రాష్ట్రంలో పెంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించినా సచివాలయంలో మాత్రం విఫలమై ఎండిపోయింది. అందుకు కారణాలేమైనా కేసీఆర్ విజయ కాంక్ష సెంటిమెంట్‌తో నాటిని మొక్క ఎండిపోయిన తీరు ఆయనకు ఎదురయ్యే అపజయానికి సంకేతాలినిచ్చిందన్న ప్రచారానికి దోహదపడటం ఆసక్తికరంగా మారింది.