Site icon vidhaatha

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌.. భారీ జరిమానా విధించిన న్యూయార్క్‌ కోర్టు..

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. ఫ్రాడ్‌ కేసులో న్యూయార్క్‌ కోర్టు ఆయనకు భారీగా జరిమానా విధించింది. 335 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.2,946) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దాంతో పాటు న్యూయార్క్​లోని కార్పొరేషన్​లో డైరెక్టర్​గా​, అధికారిగా పనిచేయకుండా మూడేళ్ల పాటు మాజీ అధ్యక్షుడిపై నిషేధం విధిస్తూ కీలక తీర్పును వెలువరించింది.


అలాగే ఆయన కుమారులకు సైతం జరిమానా విధించింది. సమాచారం మేరకు.. సివిల్‌ ఫ్రాడ్‌ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్‌ కోర్టు 90 పేజీల తీర్పును ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లకు కోర్టు నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది. అలాగే, ట్రంప్ కుమారులిద్దరూ న్యూయార్క్ కంపెనీలో రెండేళ్లపాటు డైరెక్టర్లుగా పని చేయకుండా ఆదేశాలు జారీ చేసింది.


అయితే, సివిల్‌ ఫ్రాడ్‌ కేసులో తాను, కుమారులు ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆరోపణలను కొట్టిపడేస్తూ వచ్చారు. తననే మోసం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ కేసులో 370 మిలియన్ డాలర్లు చెల్లించేలా ట్రంప్‌కు ఆదేశాలు ఇవ్వాలని అటార్నీ జనరల్ కార్యాలయం న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు కోర్టు ట్రంపుకు 354.8 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసు విచారణ రెండు నెలలకుపైగా కొనసాగింది. ఇందులో ట్రంప్, ట్రంప్ కంపెనీ ఉన్నతాధికారులు, ట్రంప్ పిల్లలతో సహా 40 మంది సాక్షులు కోర్టుకు హాజరయ్యారు.


కేసు విచారణ సమయంలో ఇంతకు ముందు కోర్టు కంపెనీ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అలెన్‌ వీసెల్‌బర్గ్‌ను మిలియన్‌డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. మూడేళ్ల పాటు కంపెనీలో పని చేయకుండా నిషేధం విధించింది. ట్రంప్‌ తరఫు న్యాయవాది అలీనా హబ్బా కోర్టు నిర్ణయం అన్యాయమన్నారు. కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ట్రంప్‌కు ఇది భారీ షాక్‌లాంటిదే.

Exit mobile version