వైట్‌హౌస్ గేటును ఢీకొట్టిన వాహనం.. వారాల వ్య‌వ‌ధిలో రెండో అనుమానాస్ప‌ద ఘ‌ట‌న‌

అమెరికా (America) అధ్య‌క్షుడి నివాసం వైట్‌హౌస్ (White House) వ‌ద్ద మ‌రోసారి అనుమానాస్ప‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అమెరికా (America) అధ్య‌క్షుడి నివాసం వైట్‌హౌస్ (White House) వ‌ద్ద మ‌రోసారి అనుమానాస్ప‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది.అమెరికా (America) అధ్య‌క్షుడి నివాసం వైట్‌హౌస్ (White House) వ‌ద్ద మ‌రోసారి అనుమానాస్ప‌ద ఘ‌ట‌న చోటు చేసుకుంది.సోమ‌వారం సాయంత్రం వైట్‌హౌస్ బ‌య‌టిగేటును ఓ వాహ‌నం ఢీకొట్టింది. ఈ విష‌యాన్ని సీక్రెట్ స‌ర్వీసెస్ ధ్రువీక‌రించిన‌ట్లు అక్క‌డి మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. వెంట‌నే డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్న పోలీసులు.. ఘ‌ట‌న‌కు దారితీసిన కార‌ణాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. సాయంత్రం 6 అవుతుండ‌గా ఓ వాహ‌నం వేగంగా వ‌చ్చి వైట్‌హౌస్ గేటును ఢీకొట్టింది.


దీనికి కార‌ణం ఏమిటి, డ్రైవ‌ర్ గ‌తం ఏమిటి అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తున్నాం అని సీక్రెట్ స‌ర్వీసెస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ నివాసంలో లేర‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న కారణంగా వైట్‌హౌస్ చుట్టుప‌క్క‌ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే కొద్ది వారాల కింద‌ట ఈ త‌ర‌హా ఘ‌ట‌నే జో బైడెన్‌కు ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న భారీ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని జేమ్స్ కూప‌ర్ (46)గా గుర్తించారు. పోలీసుల క‌స్ట‌డీ ముగియ‌డంతో ప్ర‌స్తుతం అత‌ణ్ని విడుద‌ల చేయ‌గా.. కోర్టులో హాజ‌రు కావాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిసింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో అత‌డు పూర్తిగా మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. విచార‌ణ త‌ర్వాత ఇది ఒక మ‌ద్యం మ‌త్తులో జ‌రిగిన ప్ర‌మాద‌మేన‌ని తేలింది. ఆ మేర‌కు అత‌డిపై కేసు న‌మోదు చేశాం అని వెల్మింగ్ట‌న్ పోలీసులు వెల్ల‌డించారు.


ఈ ఘ‌ట‌న జ‌రిగిన కాసేప‌టికే బైడెన్..వైట్‌హౌస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. త‌న ఎన్నిక‌ల పోటీ గురించి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. అధ్య‌క్షుడు ఉంటున్న ప్ర‌దేశాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంపై భ‌ద్ర‌తా నిపుణులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌-హ‌మాస్ సంక్షోభం నేప‌థ్యంలో అత్యంత ప‌క‌డ్బందీ భ‌ద్రతా ఏర్పాట్లు ఉండాల‌ని సూచిస్తున్నారు.

Latest News