భోపాల్ : వివాహేతర సంబంధం ఇద్దరి హత్యకు దారి తీసింది. ఈ దారుణానికి పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. అతను సరిత ఠాకూర్(38) అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే సరితకు మమత(32) అనే మహిళతో పరిచయం ఉంది. మమతకు భర్త నితిన్ పవార్(35) ఉన్నాడు.
అయితే సరిత మమతను తీసుకెళ్లి రవికుమార్‌కు పరిచయం చేసింది. దీంతో రవికుమార్, మమత మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం నితిన్‌కు తెలియడంతో భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా.. రవికుమార్‌తో తనకున్న రిలేషన్‌ను మమత పక్కన పెట్టింది. దీంతో తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని, లేదంటే నగ్న వీడియోలు బయటపెడుతానని మమతను రవికుమార్ బ్లాక్ మెయిల్ చేశాడు. అతని వేధింపులు భరించలేని మమత, తన భర్తను తీసుకొని నేరుగా సరిత ఇంటికి వెళ్లింది.
సరితతో పాటు రవికుమార్ కూడా అక్కడే ఉన్నాడు. ఇక ఆగ్రహంతో ఉన్న నితిన్, మమత కలిసి.. ఆ ఇద్దరిపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని పోలీసులు సీజ్ చేశారు.