Site icon vidhaatha

Viral | గుడిలో దేవుడిని పూజించి.. మరీ దొంగతనం

Viral |

అలీగఢ్‌: కొన్ని కొన్ని దొంగతనాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలా కూడా చేస్తారా? అన్న అనుమానాన్నీ కలిగిస్తాయి. సాధారణంగా దైవ భక్తి ఉన్నవారు దొంగతనం చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడనే భయంతో ఉంటారు.

కానీ.. ఈ దొంగ.. మాత్రం దేవుడా.. నీ ఆలయంలోనే దొంగతనం చేస్తున్నా.. నన్ను దీవించు.. అంటూ పూజలు చేసి మరీ గుడి గంటను కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది.

ఇగ్లాస్‌ ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పురాతన దేవాలయం ఉన్నది. ఆ ఆలయంలోకి ప్రవేశించిన దొంగ.. ముందుగా గౌరవ పూర్వకంగా దేవుని ప్రతిమల ముందు సాష్ఠాంగ ప్రమాణం చేశాడు. తర్వాత చేతులతో భజన చేస్తూ పూజ, అర్చన కానించాడు.

పూజ పూర్తయిన వెంటనే గర్భగుడిలోకి జొరబడి.. లోపల వేలాడుతున్న ఇత్తడి గంటను దొంగిలించి.. పరారయ్యాడు. అయితే.. సదరు దొంగగారి ఘనకార్యం మొత్తం.. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిపోయింది. దొంగ స్టైల్‌ను చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. తేరుకుని.. అతడిని పట్టకునేందుకు రంగంలోకి దిగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Exit mobile version