KarimNagar: షూటింగ్ స్పాట్‌గా తీగల వంతెన.. ప్రారంభానికి ముందే, సినిమాల చిత్రీకరణ

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్‌కు పర్యాటక శోభ తీసుకు రాబోతున్న తీగల వంతెన ప్రారంభానికి ముందే షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.. కళల కాణాచి కరీంనగర్‌కు చెందిన కళాకారులు తమకు మరో షూటింగ్ స్పాట్ దొరికిందని సంబరపడి పోతున్నారు.. స్థానిక కళాకారులు తుది మెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెన పై అప్పుడే షూటింగ్‌లు తీయడం ప్రారంభించారు.. దర్శకుడు మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమవుతున్న కామెడీ ఓరియంటెడ్ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను శనివారం ఇక్కడ చిత్రీకరించారు. హీరో, హీరోయిన్లపై […]

  • Publish Date - April 17, 2023 / 08:11 AM IST

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్‌కు పర్యాటక శోభ తీసుకు రాబోతున్న తీగల వంతెన ప్రారంభానికి ముందే షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.. కళల కాణాచి కరీంనగర్‌కు చెందిన కళాకారులు తమకు మరో షూటింగ్ స్పాట్ దొరికిందని సంబరపడి పోతున్నారు.. స్థానిక కళాకారులు తుది మెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెన పై అప్పుడే షూటింగ్‌లు తీయడం ప్రారంభించారు..

దర్శకుడు మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమవుతున్న కామెడీ ఓరియంటెడ్ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను శనివారం ఇక్కడ చిత్రీకరించారు. హీరో, హీరోయిన్లపై పాటను చిత్రికరించే పనిలో సినిమా యూనిట్ నిమగ్నమై ఉంది..

ఫ్రీ వెడ్డింగ్ షూట్, షార్ట్ ఫిలిం, ఫోక్ సాంగ్స్ చిత్రీకరణకు ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆండాలమ్మ గుడి వేదికగా నిలిచింది. ప్రస్తుతం కరీంనగర్ మానేరుపై నిర్మించిన తీగల వంతెన ఇలాంటి ఈవెంట్లు చేసే వారికి ఆహ్వానం పలుకుతోంది.