Site icon vidhaatha

Kannappa: భ‌క్తా.. ర‌క్తా! ఇదేమీ క‌న్న‌ప్ప‌.. నెట్టింట కౌంట‌ర్స్

Kannappa:

విధాత‌: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతున్న చిత్రం క‌న్న‌ప్ప‌ (Kannappa). ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు ముకేశ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 25న‌ థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి స‌గ‌మై చెరి స‌గ‌మై అంటూ సాగే లిరిక‌ల్ ల‌వ్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

శ్రీమ‌ణి ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా రేవంత్‌, సాహితి చాగంటి ఆల‌పించారు. కేర‌ళ‌కు చెందిన మ్యూజిక్ సెన్షేష‌న్ స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించాడు. ‘స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్ (Mukhesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌గా సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు.

ఈ మూవీలో మోహ‌న్ లాల్ (Mohanlal), రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas), మోహ‌న్ బాబు (Mohan Babu M), అక్ష‌య్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్‌, శ‌ర‌త్ కుమార్‌, మ‌ధుబాల‌, కాజోల్‌, ప్రీతి ముకుంద‌న్ (Preity Mukundhan) కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. అవా ఎంటర్టైన్మెంట్ (AVA Entertainments) మరియు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకం (Twenty Four Frames Factory)పై మోహన్‌ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్నిభారీ బ‌డ్జెట్‌తో నిర్మించనున్నారు.

అయితే తాజాగా పాట విడుద‌లైన ఈ పాట‌ మిలియ‌న్ల‌లో వ్యూస్ ద‌క్కించుకుంటున్న‌ప్ప‌టికీ అదే స్థాయిలో విమ‌ర్శ‌లు సైతం మూట గ‌ట్టుకుంటోంది. భ‌క్తి సినిమాలో ఇలాంటి పాటేంటి, మ‌రీ ఇంత గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌ణ‌ ఏంటి అంటూ చాలా మంది నెటిజ‌న్లు దుయ్య‌బ‌డుతున్నారు. ఇలా అయితే ఫ్యామిలీస్‌తో క‌లిసి, పిల్ల‌ల‌తో ఈ సినిమాను చూడ‌డం క‌ష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version