Tilak Varma: మరి కొద్ది నెలలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా వెస్టిండీస్ టూర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్ట్ ల సిరీస్‌ని 1-0తో గెలుచుకోగా, వన్డే సిరీస్‌ని 2-1తో దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు టీ 20లు పూర్తి కాగా, రెండు మ్యాచ్‌లలో విండీస్ విజయం సాధించింది. చిన్న చిన్నటీమ్‌లపైన కూడా దారుణంగా ఓడిపోయిన విండీస్ ఇప్పుడు భారత్‌పై గెలుస్తుండడంతో వారిని గెలిపించేందుకు ఇండియా టీం వెస్టిండీస్‌కి వచ్చిందని మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తొలి టీ20 ఓడిన కూడా రెండో టీ20 తప్పక గెలుస్తారని భావించగా, అందులోను చెత్త ప్రదర్శన కనబరిచి దారుణంగా ఓడిపోయారు.
అయితే రెండో టీ20లో భారత క్రికెటర్స్ సంతోషపడే విషయం ఏంటంటే.. మన తెలుగు కుర్రాడు కెరీర్‌లోతొలి అర్ధ సెంచరీ నమోదు చేయడమే. ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. అయితే రెండో టీ20లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తిలక్ వర్మ, అందరిలా బ్యాటుని పైకి ఎత్తకుండా డ్యాన్సింగ్ సెలబ్రేషన్ జరిపాడు. తిలక్ వర్మ వెరైటీ డ్యాన్సింగ్ సెలబ్రేషన్స్‌కి కారణం ఏంటా అని అందరు ఆరాలు తీసారు. అయితే అలా డ్యాన్సింగ్ చేయడం వెనక కారణం ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
చిన్నప్పటి నుంచి కూడా రోహిత్ భాయ్, రైనా బాయ్ అన్నా కూడా చాలా ఇష్టం . ఐపీఎల్ సమయంలో రోహిత్ భయ్యాతో విలువైన సమయం గడిపాను. నన్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతావని ఎంకరేజ్ చేశారు.ఆయన చెప్పిన మాటలు నాతో ఎంతో విశ్వాసం నింపాయి. అతని ఇచ్చిన గైడెన్స్ తోనే ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ మరింత క్రమశిక్షణగా ఉండడం నేర్చుకున్నాను… అది నా ఆటకు మరింత ఉపయోగపడింది.. ఇక నేను, రోహిత్ భయ్యా కూతురు ఇద్దరం మంచి స్నేహితులం. మేము సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్టు ఆడుకుంటాం. ఎప్పుడైన సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేసిన కూడా తను అలా సెలబ్రేట్ చేస్తానని సమైరాకి మాట ఇచ్చానంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చారు. మొత్తానికి తిలక్ వర్మ డ్యాన్స్ సెలబ్రేషన్ వెనక రోహిత్ శర్మ డాటర్ ఉందని క్రికెట్ ప్రియులకి ఓ క్లారిటీ వచ్చింది.