TNGO | నూతన పేరివిజన్ కమిటీనీ ఏర్పాటు చేయాల‌ని సీఎస్‌కు విన‌తి

TNGO సీఎస్‌కు విన‌తి ప‌త్రం అందించిన… టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ విధాత: నూతన పే రివిజన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి విన‌తిప‌త్రం అందించారు. బుధ‌వారం మార్గం జగదీశ్వర్ నేతృత్వంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్ తో క‌లిసి స‌చివాల‌యంలో ప్ర‌ధాన కార్యదర్శి సీఎస్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పీఆర్సీ కమిటీని నియమించాలని, […]

  • Publish Date - June 14, 2023 / 02:21 PM IST

TNGO

  • సీఎస్‌కు విన‌తి ప‌త్రం అందించిన…
  • టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

విధాత: నూతన పే రివిజన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి విన‌తిప‌త్రం అందించారు. బుధ‌వారం మార్గం జగదీశ్వర్ నేతృత్వంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్ తో క‌లిసి స‌చివాల‌యంలో ప్ర‌ధాన కార్యదర్శి సీఎస్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పీఆర్సీ కమిటీని నియమించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారించాలని కోరారు.

రాష్ట్రంలో 2023 జూలై 1 నుండి అమలు జరిగేలా చూడాల‌ని, ఇంటిరిం రిలీఫ్(IR) ను ప్రకటించాల‌ని కోరారు. అలాగే పెండింగ్ డి.ఏ లను వెంటనే విడుదల చేయ‌డంతో పాటు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను భ‌ర్తీ చేయాల‌న్నారు. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ఉద్యోగుల చందాతో ఈ హెచ్ ఎస్ సౌకర్యాన్ని కల్పించాల‌న్నారు.

గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 36, 37లో గతంలో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీకి కేటాయించడానికి ప్రభుత్వ మేమొను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. రాష్ట్ర నూతన సచివాలయంతో పాటు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీఓ కార్యాలయానికి ఆఫీసును కేటాయించాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలకు ప్రమోషన్ కల్పించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి అన్ని శాఖలలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాల‌న్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాల‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రలో పనిచేస్తున్న 80 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎస్‌కు అందించిన విన‌తిప‌త్రంలో కోరారు.

Latest News