Site icon vidhaatha

TNGO సంఘానికి సాదిక్ అలీ సేవలు చిరస్మరణీయం: నరేందర్

TNGO

విధాత, మెదక్ బ్యూరో: టిఎన్జీవో సంఘానికి సాధిక్ అలీ చేసిన సేవలు చిరస్మరణీయమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పేర్కొన్నారు‌. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని సాదిక్ అలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు‌.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ‌.. టీఎన్జీవో సంఘానికి కాకుండా సీనియర్ ఇన్స్పెక్టర్‌గా జిల్లా సహకార శాఖకు విశిష్టమైన సేవలు అందించి అధికారుల మన్ననల తోపాటు, కులవృత్తి సంఘాల సభ్యులకు సహకార శాఖ ద్వారా తమ అమూల్యమైన సేవలు అందించి జిల్లా ప్రజల ఆదరభిమానాలు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బట్టి రమేష్, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండి ఫజలుద్దీన్, మెదక్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పంపరి శివాజీ, ఆరేళ్ల రామా గౌడ్, రఘునాథరావు, తదితర ఉద్యోగులు సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version