Site icon vidhaatha

Haleem | మీకు హాలీం తినాల‌ని ఉందా..? అయితే ఈ 10 సెంట‌ర్స్‌లో ట్రై చేయండి..!

Haleem | రంజాన్( Ramzan ) అన‌గానే గుర్తొచ్చే వంట‌కం ఏదైనా ఉందా..? అంటే అది హాలీం( Haleem ) అని చెప్పొచ్చు. హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర వ్యాప్తంగా.. ప్ర‌తి వీధిలో హాలీం కేంద్రాలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. సాయంత్రం కాగానే.. ఘుమ‌ఘుమ‌లు వెద‌జ‌ల్లుతాయి.. ఆ వాస‌న‌కే క‌డుపు నిండిపోయేలా.. హాలీం మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తోంది. హాలీం ఆరోగ్యానికి కూడా మంచిది. నాణ్య‌త‌తో కూడిన మేక మాంసంతో హాలీంను త‌యారు చేస్తారు. అయితే ఈ హాలీం.. హైద‌రాబాద్‌లోని ఓ ప‌ది సెంట‌ర్ల‌లో తింటే.. జీవితాంతం ఆ రుచి గుర్తుండిపోతోంది. మ‌రి ఆ ప‌ది హాలీం సెంట‌ర్లు ఏవో చూద్దాం..

కేఫే బ‌హార్

బ‌షీర్‌బాగ్‌లో ఉన్న కేఫే బ‌హార్( Cafe Bahar ).. మ‌ట‌న్ బిర్యానీనికి ప్ర‌సిద్ధి. గత కొన్ని ద‌శాబ్దాల నుంచి ఇక్క‌డ హాలీంను తయారు చేసి విక్ర‌యిస్తున్నారు. ఈ సెంట‌ర్‌లో మట‌న్ హాలీం ఫేమ‌స్. నాణ్య‌త‌తో కూడిన నెయ్యితో హాలీంను త‌యారు చేస్తారు. పీక్ అవ‌ర్స్‌లో వెళ్తే.. హాలీం కోసం వేచి ఉండాల్సిందే.

పిస్తా హౌజ్

ఇక హాలీంకు కేరాఫ్ అడ్ర‌స్ పిస్తా హౌజ్ ( Pista House ). హాలీం తినేందుకు పిస్తా హౌజ్‌ల వ‌ద్ద జనాలు ఎగ‌ బాడుతారు. హైద‌రాబాద్‌లో చాలా చోట్ల పిస్తా హౌజ్ సెంట‌ర్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు.

షాదాబ్

షాదాబ్ ( Shadab ) హోట‌ల్ పాత బ‌స్తీలో ఉంది. చికెన్ క‌బాబ్ నుంచి మొద‌లుకుంటే మ‌ట‌న్ బిర్యానీ వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. వెజిటేరియ‌న్ వంట‌కాలు కూడా ల‌భ్య‌మ‌వుతాయి. ఇక హాలీం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. పీక్ అవ‌ర్స్‌లో వెళ్తే కొంచెం వెయిట్ చేయాల్సిందే.

బావ‌ర్చి

హైద‌రాబాద్ న‌గ‌రంలో బావ‌ర్చి ( Bawarchi ) సెంట‌ర్లు అనేకం ఉన్నాయి. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న బావ‌ర్చినే ఒరిజిన‌ల్ సెంట‌ర్. సాయంత్రం వేళ హాలీం కోసం బావ‌ర్చి వ‌ద్ద జ‌నాలు ఎగ‌బాడుతారు.

షా గౌస్

షా గౌస్( Shah Ghouse ) ఔట్‌లెట్స్ కొన్ని మాత్ర‌మే ఉన్నాయి. ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు, ఫ్రైడ్ అనియ‌న్స్‌తో క‌లిపి హాలీం స‌ర్వ్ చేస్తుంటారు. ఇక్క‌డ త‌యారు చేసే హాలీం రుచి మ‌రెక్క‌డా దొర‌క్క‌పోవ‌చ్చు. నాణ్య‌మైన నెయ్యిని ఉప‌యోగించి హాలీంను త‌యారు చేస్తారు. చార్మినార్ బ్రాంచ్ వద్ద లభించేది ఒరిజినల్ హలీంగా పేరు.

కేఫే 555

కేఫే 555( Cafe 555 ) మాసాబ్ ట్యాంక్ వ‌ద్ద ఉంటుంది. మట‌న్ హాలీంకు ప్ర‌సిద్ధి. స‌ర‌సమైన ధ‌ర‌ల్లోనే హాలీం ల‌భించును. ఇక్క‌డ ల‌భ్య‌మ‌య్యే హాలీం కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

స‌ర్వి రెస్టారెంట్

బంజారాహిల్స్‌లో ఉన్న స‌ర్వి రెస్టారెంట్( Sarvi Restaurant ) కూడా హాలీంకు ఫేమ‌స్. ఇక్క‌డ్నుంచి సినీ ప్ర‌ముఖులు కూడా హాలీం తీసుకెళ్తుంటారు. అంత రుచిగా ఉంటుంది. ఇక్క‌డ చాయ్ కూడా ఫేమ‌స్.

బెహ్రౌజ్

బెహ్రౌజ్( Behrouz ) సెంట‌ర్‌లో దొరికే హాలీం నోట్లో వేసుకుంటే క‌రిగిపోతోంది. నిజాంల కాలం నుంచే ఈ సెంట‌ర్‌లో హాలీం త‌యారు చేస్తున్నారు. వీరికి న‌గ‌ర వ్యాప్తంగా ఔట్‌లెట్స్ ఉన్నాయి.

మెహ్‌ఫీల్

నారాయ‌ణ‌గూడలో ఉండే మెహ్‌ఫీల్( Mehfil ) హోట‌ల్ మ‌ట‌న్ బిర్యానీతో పాటు హాలీంకు ఎంతో ప్ర‌సిద్ధి. ఇక్క‌డ బిర్యానీ తినాలి అంటే వెయిటింగ్ చేయ‌క త‌ప్ప‌దు. ఇక్క‌డ మ‌ట‌న్ హాలీం తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌పిస్తుంది.

ప్యార‌డైస్ ఫుడ్ కోర్టు

ప్యార‌డైస్ ఫుడ్ కోర్టు( Paradise Food Court )లో అన్ని నాన్ వెజ్ వంట‌కాలు రుచిగా ఉంటాయి. హాలీం కూడా అద్భుత‌మైన రుచిని కలిగి ఉంటుంది. మ‌ట‌న్ హాలీం రుచిగా ఉంటుంది.

Exit mobile version