December 31st | డిసెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. రెండు రోజురోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. అయితే, డిసెంబర్ 31లోగా చేయాల్సిన పలు పనులు సైతం ఉన్నాయి. కొన్ని పనుల గడువు ముగియబోతున్నది. డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ నామినేషన్, యూపీఐ, లాక్ డిపాజిట్‌కు సంబంధించిన గడువు ముగియబోతున్నది. గడువు ముగిసిన తర్వాత ఆయా పనులు చేసుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం రండి..!
డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ నామినేషన్..
మీలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే.. నామినీ పేరును యాడ్ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉన్నది. ఇంతకు ముందు డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ కోసం గడువు 3 నెలల పాటు అంటే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచారు. నామినీ పేరు జతచేయకపోతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది.
యూపీఐ..
ప్రస్తుతం యూపీఐ సేవలను అందరు వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31తో యాక్టివ్‌లోలేని యూపీఐ ఐడీలను ఆయా కంపెనీలు డీ యాక్టివేట్ చేయనున్నారు. ఏడాది కాలంగా ఒక్కసారి కూడా వినియోగించని యూపీఐ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
లాకర్ ఒప్పందం చేసుకోవాలి..
ఏదైనా బ్యాంకుల్లో లాకర్ ఉన్న ఖాతాదారులు తప్పనిసరిగా లాకర్ ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31తో గడువు ముగియందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లి అగ్రిమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే లాకర్‌ను సదుపాయాన్ని తొలగించే అవకాశం ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఆర్థిక శాఖ జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. గత జులై 31 నాటికి ఐటీఆర్ ఫైల్ చేయని వారికి ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఛాన్స్ ఇచ్చింది. లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రూ.5వేల జరిమానాతో ఐటీఆర్‌ను ఫైల్ చేసేందుకు అవకాశం ఇచ్చింది.