Site icon vidhaatha

Sonia Gandhi | విప‌క్షాల కూట‌మి సార‌థి సోనియా.. క‌న్వీన‌ర్‌గా నితీష్‌..!

Sonia Gandhi | వ‌రుస‌గా ప‌దేండ్లు అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీని చిత్తుగా ఓడించేందుకు విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన విప‌క్షాల స‌మావేశానికి మొత్తం 26 పార్టీలు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం ప్ర‌ధానంగా కొత్త కూట‌మి పేరును ఖ‌రారు చేయ‌నున్నారు. అదే విధంగా కూట‌మి విధివిధానాలు రూపొందించ‌నున్నారు. ఇందుకు ఓ స‌బ్ క‌మిటీని కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.

అయితే విప‌క్షాల నేతృత్వంలో ఏర్ప‌డే కొత్త కూట‌మి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ సార‌థ్యంలోనే ఏర్ప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. కూట‌మి క‌న్వీన‌ర్‌గా బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ నియామ‌కం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంపై మంగ‌ళ‌వారం సాయంత్రం నాటికి స్ప‌ష్ట‌త రానుంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీని ఓడించేందుకు ఏక‌మ‌వుతున్న విప‌క్షాల కూట‌మి.. కొత్త పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలోనే యూపీఏ పేరును కూడా మార్చాల‌ని నిర్ణ‌యించారు. అయితే కొత్త కూట‌మి పేరులో క‌చ్చితంగా ఇండియా అనే ప‌దం ఉండాల‌ని ప‌లువురు నాయ‌కులు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇండియా అనే ప‌దం ఉండేలా కూట‌మికి పేరు పెట్టాల‌ని భావించినట్లు తెలుస్తోంది. కూట‌మి ట్యాగ్ లైన్ యునైటెడ్ వి స్టాండ్ అని ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

సామాజిక న్యాయం, స‌మ్మిళిత అభివృద్ధి, జాతి సంక్షేమ‌మే ధ్యేయంగా కొత్త కూట‌మి ముందుకు వెళ్ల‌నుంద‌ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేర్కొన్నారు. ద్వేషం, విభజన, దోపిడి వంటి నిరంకుశ, ప్రజా వ్యతిరేక రాజకీయాల నుండి భారతదేశ ప్రజలను విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ దేశం మేమంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.

Exit mobile version