Site icon vidhaatha

Mahesh Kumar Goud| ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ ఇంచార్జిల నియమించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పది జిల్లాల ఇంచార్జిలను టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా ఇంచార్జిగా చల్లా వంశీచంద్‌రెడ్డి, నల్గొండ ఇంచార్జీగా సంపత్‌ కుమార్, మెదక్ జిల్లాకు పొన్నం ప్రభాకర్‌, వరంగల్ కు అడ్లూరి లక్ష్మణ్‌, హైదరాబాద్‌ కు టి. జగ్గారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు శివసేనారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కరీంనగర్‌ జిల్లాకు అద్దంకి దయాకర్, మహబూబ్‌నగర్‌ జిల్లాకు కుసుమ కుమార్‌, నిజామాబాద్ జిల్లాకు అజ్మత్‌ హుస్సేన్ లను ఇంచార్జిలుగా నియమించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించింది. తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇంచార్జిలను నియమించింది. సోమవారం వారితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లు జూమ్ మీటింగ్ లో సమావేశమయ్యారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా ఇంచార్జిలంతా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు.

 

Exit mobile version