Traffic Challan | లైన్‌మెన్‌కు ట్రాఫిక్ చ‌లాన్.. పోలీసు స్టేష‌న్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

Traffic Challan | విద్యుత్ శాఖ‌లో ప‌ని చేస్తున్న ఓ లైన్‌మెన్‌కు ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్ విధించారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల‌పై ప్ర‌తీకారం పెంచుకున్న లైన్‌మెన్‌.. సంబంధిత పోలీసు స్టేష‌న్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హాపూర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని ధిర్‌ఖేడాకు చెందిన ఖ‌లీద్ హపూర్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌తి రోజు ధిర్‌ఖేడా నుంచి హ‌పూర్‌కు త‌న బైక్‌పై హెల్మెట్ ధ‌రించ‌కుండా రాక‌పోక‌లు కొన‌సాగిస్తున్నాడు. దీంతో పోలీసులు ఖ‌లీద్‌కు […]

  • Publish Date - May 29, 2023 / 02:46 PM IST

Traffic Challan | విద్యుత్ శాఖ‌లో ప‌ని చేస్తున్న ఓ లైన్‌మెన్‌కు ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్ విధించారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల‌పై ప్ర‌తీకారం పెంచుకున్న లైన్‌మెన్‌.. సంబంధిత పోలీసు స్టేష‌న్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హాపూర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని ధిర్‌ఖేడాకు చెందిన ఖ‌లీద్ హపూర్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌తి రోజు ధిర్‌ఖేడా నుంచి హ‌పూర్‌కు త‌న బైక్‌పై హెల్మెట్ ధ‌రించ‌కుండా రాక‌పోక‌లు కొన‌సాగిస్తున్నాడు.

దీంతో పోలీసులు ఖ‌లీద్‌కు రూ. 1000 చ‌లాన్ విధించారు. హెల్మెట్ ధ‌రించ‌కుండా, ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు చ‌లాన్ విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

చ‌లాన్ చెల్లించే ప్ర‌స‌క్తే లేద‌ని, తాను ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాన‌ని తెలిపాడు. చ‌లాన్ చెల్లించాల్సిందేన‌ని, అంద‌రికీ ఒక‌టే రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

దీంతో పోలీసుల‌పై లైన్‌మెన్ ప్ర‌తీకారం పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలో పోలీసు స్టేష‌న్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశాడు. ఉన్న‌తాధికారుల జోక్యంతో మళ్లీ పీఎస్‌కు విద్యుత్‌ను పున‌రుద్ధ‌రించారు. ఈ విష‌యం స్థానికంగా ఆస‌క్తిక‌రంగా మారింది.

Latest News