రాష్ట్ర‌ప‌తి ముర్ము పాదాల‌ను తాకేందుకు య‌త్నం.. ఇంజినీర్‌పై వేటు

విధాత‌: రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రుల‌తో పాటు ఇత‌ర నాయ‌కుల ఆశీర్వాదం, మెప్పు పొందేందుకు అప్పుడ‌ప్పుడు కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బెడిసి కొడుతుంటాయి. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పాదాల‌ను తాకేందుకు ప్ర‌య‌త్నించిన ఓ ఇంజినీర్ స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌న‌వ‌రి 3, 4వ తేదీల్లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాజ‌స్థాన్‌లో ప‌ర్య‌టించారు. అయితే రోహెత్‌లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ముర్ముకు రాజ‌స్థాన్ అధికారులు ఘ‌నంగా […]

  • Publish Date - January 15, 2023 / 08:12 AM IST

విధాత‌: రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రుల‌తో పాటు ఇత‌ర నాయ‌కుల ఆశీర్వాదం, మెప్పు పొందేందుకు అప్పుడ‌ప్పుడు కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బెడిసి కొడుతుంటాయి. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పాదాల‌ను తాకేందుకు ప్ర‌య‌త్నించిన ఓ ఇంజినీర్ స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌న‌వ‌రి 3, 4వ తేదీల్లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాజ‌స్థాన్‌లో ప‌ర్య‌టించారు. అయితే రోహెత్‌లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ముర్ముకు రాజ‌స్థాన్ అధికారులు ఘ‌నంగా స్వాగతం ప‌లికారు. అయితే ప్ర‌జారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్న అంబా సియోల్.. రాష్ట్ర‌ప‌తి పాదాల‌ను ట‌చ్ చేసేందుకు య‌త్నించారు.

ప్రెసిడెంట్ సెక్యూరిటీ అప్ర‌మ‌త్త‌మై ఇంజినీర్‌ను అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ సీరియ‌స్‌గా స్పందించింది. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది. స్థానిక పోలీసులు కూడా విచార‌ణ చేప‌ట్టారు. మొత్తానికి ఇంజినీర్ సియోల్‌ను విధుల నుంచి తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం.