TS Eamcet 2023 | రేపటి నుంచే తెలంగాణ ఎంసెట్‌.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..! గుర్తింపుకార్డు కూడా..!!

TS Eamcet 2023 | రాష్ట్రంలో బుధవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును తీసుకురావాలని, గుర్తింపు కార్డును చూపిస్తేనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ కుమార్‌ తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుంటే అభ్యర్థులకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ […]

  • Publish Date - May 9, 2023 / 03:30 AM IST

TS Eamcet 2023 |

రాష్ట్రంలో బుధవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును తీసుకురావాలని, గుర్తింపు కార్డును చూపిస్తేనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ కుమార్‌ తెలిపారు.

గుర్తింపు కార్డులు లేకుంటే అభ్యర్థులకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీకార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకురావాలని సూచించారు.

గుర్తింపు కార్డులకు జిరాక్స్‌, స్కాన్డ్‌ కాపీలను అంగీకరించమని చెప్పారు. ఈ నెల 10, 11తేదీలలో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగాల వారికి, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్ష ఉంటుందని కన్వీనర్‌ తెలిపారు. అయితే, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ప్రకటించారు.

ఇక పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తొలి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్‌ కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో 132మంది అబ్జర్వర్లను నియమించారు. ఎంసెట్ కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,53,935మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులకు 94,614మంది దరఖాస్తు చేశారు. తెలంగాణ నుంచి మొత్తం 2,48,549మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవనున్నారు.

ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్‌కు ఇంజినీరింగ్ విభాగంలో 51,470మంది, అగ్రికల్చర్ కోర్సులకు 20,747మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ఎంసెట్‌కు మొత్తం 72,217మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల నుంచి ఎంసెట్ పరీక్షలకు 3,20,766 మంది విద్యార్థులు హాజరవనున్నారు.

Latest News