EAMCET | తెలంగాణ‌లో ఎంసెట్ తొలి విడుత ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు

31 కాలేజీల్లో 100 శాతం సీట్లు భ‌ర్తీ కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లు ఫుల్ సివిల్, ట్రిపుల్ ఈకి లేని ఆద‌ర‌ణ‌.. ఆ రెండు కోర్సుల్లో ఒక్క సీటు కూడా భ‌ర్తీ కాలేదు 22 వ‌ర‌కు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవ‌కాశం విధాత : తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా తొలి విడుత ఇంజినీరింగ్ సీట్ల‌ను ఆదివారం కేటాయించారు. తొలి విడుత‌లో 85.48 […]

  • Publish Date - July 16, 2023 / 11:02 AM IST

  • 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు భ‌ర్తీ
  • కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లు ఫుల్
  • సివిల్, ట్రిపుల్ ఈకి లేని ఆద‌ర‌ణ‌..
  • ఆ రెండు కోర్సుల్లో ఒక్క సీటు కూడా భ‌ర్తీ కాలేదు
  • 22 వ‌ర‌కు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవ‌కాశం

విధాత : తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా తొలి విడుత ఇంజినీరింగ్ సీట్ల‌ను ఆదివారం కేటాయించారు.

తొలి విడుత‌లో 85.48 శాతం సీట్లు నిండగా, మూడు యూనివ‌ర్సిటీలు, 28 ప్ర‌యివేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, తొలి విడుత‌లో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్నాయి. కంప్యూట‌ర్ సైన్సు కోర్సుల్లో ఒక్క సీటు కూడా మిగ‌ల్లేదు. ఇక సివిల్, ట్రిపుల్ ఈ కోర్సులకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.

కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భ‌ర్తీ కాగా, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌లో 98.65 శాతం, జియో ఇన్ఫ‌ర్మెటిక్స్‌లో 95.38 శాతం, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌లో 93.94 శాతం సీట్లు నిండాయి. ఇండ‌స్ట్రీయ‌ల్ ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలి క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఒక్క సీటు కూడా భ‌ర్తీ కాలేదు.

ఆయా ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డ‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి సీటును క‌న్ఫ‌ర్మేష‌న్ చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన త‌ర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగ‌స్టు 9 నుంచి 11వ తేదీ మ‌ధ్య‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Latest News