NHAI | ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా( NHAI )లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గేట్( GATE ) స్కోర్‌తో 60 డిప్యూటీ మేనేజర్( Deputy Manager )(టెక్నికల్) పోస్టులను నేరుగా భర్తీ చేయనుంది. ఈ 60 ఖాళీల్లో అన్‌రిజర్వ్‌డ్‌కు 27, ఈడబ్ల్యూఎస్‌లకు 7, ఓబీసీలకు 13, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4 పోస్టులు కేటాయించారు.
అర్హతలు : సివిల్ ఇంజినీరింగ్( Civil Engineering ) లో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. గేట్ స్కోర్ – 2025 తప్పనిసరి.
వయసు : 30 ఏండ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, మాజీ సైనికోద్యోగులకు ఐదేండ్ల సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 9, 2025
దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.. https://nhai.gov.in/#/