KVS NVS Vacancies 2025 | బీఈడీ( BEd ) చేసి సీటెట్( CTET ), టెట్( TET ) అర్హత సాధించిన అభ్యర్థులకు ఇది శుభవార్త. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో( Kendriya Vidyalaya ), నవోదయ విద్యాలయాల్లో( Navodaya Vidyalaya ) ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్న వారికి ఈ భారీ నోటిఫికేషన్ ఒక వరం లాంటింది. మొత్తం 14,967 టీచింగ్( Teaching ), నాన్ టీచింగ్( Non Teaching ) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో సింహభాగం టీచింగ్ పోస్టులే ఉన్నాయి. ఈ నియామకాల భర్తీ కోసం సీబీఎస్ఈ( CBSE ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించొచ్చు. నవంబర్ 14వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ డిసెంబర్ 4.
ఉద్యోగ ఖాళీలు ఇవే..
TGT, PGT, ప్రైమరీ టీచర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్లతోపాటు అనేక నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు ఇవే..
టీచింగ్ పోస్టులకు B.Ed, TET, CTET ఉత్తీర్ణత సాధించి ఉండాలి. TGT ఉద్యోగాల కోసం సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్, B.Ed, CTET ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే PGT కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు B.Ed ఉండాలి. అదే సమయంలో, ప్రైమరీ టీచర్ కోసం 12వ తరగతితోపాటు D.El.Ed లేదా BTC వంటి అర్హత, CTET తప్పనిసరి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వంటి పోస్టులకు మాస్టర్స్, B.Edతో పాటు 9 నుంచి 12 సంవత్సరాల టీచింగ్ అనుభవం తప్పనిసరి. నాన్-టీచింగ్ పోస్టుల్లో 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా హోల్డర్లు కూడా వారి అర్హత ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు వివరాలు..
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ కమిషనర్ వంటి సీనియర్ పోస్టులకు సాధారణ కేటగిరీ అభ్యర్థులు రూ. 2800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అయితే SC, ST కేటగిరీకి ఇది కేవలం రూ. 500 మాత్రమే. PGT, TGT, ప్రైమరీ టీచర్ కోసం సాధారణ అభ్యర్థికి రూ. 2000, SC, ST అభ్యర్థులకు రూ. 500 ఫీజు నిర్ణయించింది. నాన్-టీచింగ్ స్టాఫ్, క్లర్క్, స్టెనో, ల్యాబ్ అటెండెంట్ ఫీజు సాధారణ కేటగిరీకి రూ.1700, ఇతర కేటగిరీలకు రూ. 500గా నిర్ణయించారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నారు. దరఖాస్తు కోసం CBSE అధికారిక వెబ్‌సైట్ లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అనంతరం పేరు, చిరునామా, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, కేటగిరీ, ఇతర అవసరమైన సమాచారాన్ని నింపాలి. దీని తరువాత, ఫోటో, సంతకం వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును చెల్లించిన తర్వాత, ఫారమ్‌ను సమర్పించాలి.
