Cucumber Cultivation | రాజస్థాన్( Rajasthan ) బికనీర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్‌క గర్వ( Mukesh garva ).. బీఎస్సీ( BSc ), బీఈడీ( BEd ) చదివాడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. అతని తల్లిదండ్రులు తమకున్న రెండు హెక్టార్ల పొలంలో సేంద్రీయ పద్ధతి( Organic Farming )లో వేరుశనగ, ఆవాలు పండించేవారు. కానీ దిగుబడి తక్కువగా ఉండేది. అనుకున్న లాభాలు వచ్చేవి కాదు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించేవి కావు. వర్షపాతం కూడా తక్కువే. మొత్తంగా నష్టాలు చవిచూసేవారు. కేవలం ఏడాదికి రూ. 2 నుంచి 3 లక్షల ఆదాయం మాత్రమే ఆర్జించేవారు. ఇది ఆ కుటుంబానికి సరిపోయేది కాదు. రోజు రోజుకు ఆర్థిక పరిస్థితి మరింత బలహీనంగా మారింది. అయితే ముఖేష్ గర్వ( Mukesh Garva ) తన పొలంలో అడుగుపెట్టి.. పాలీహౌస్( Poly house ) ద్వారా వ్యవసాయం( Agriculture ) చేసిన తర్వాత ఏడాదికి రూ. 30 నుంచి రూ. 40 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు.
ముఖేష్ సక్సెస్ ఇలా..
ఇక ముఖేష్ బీఎస్సీ, బీఈడీ చదువుకున్నాడు కాబట్టి.. తనకు కొంత వ్యవసాయంపై అవగాహన ఉండేది. దీంతో వ్యవసాయ అధికారులను కలిసేవాడు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ట్రైనింగ్‌లకు హాజరై అధునాతన వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నాడు. దీంతో అతను వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేందుకు ఉపయోగపడింది. తక్కువ పొలంలోనూ ఎక్కువ దిగుబడి సాధించొచ్చు అనే సూత్రాన్ని నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన అడుగులు పాలీ హౌస్ వైపు పడ్డాయి.
మూడు పాలీహౌస్‌ల ఏర్పాటు..
వ్యవసాయ శాఖ సహకారంతో.. తనకున్న పొలంలో మూడు పాలీహౌస్‌లను ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కటి నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మించాడు. ఈ పాలీహౌస్‌లలో దోసకాయలను సాగు చేశాడు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని, పంట చీడపీడల నుంచి తట్టుకుంది. దిగుబడి కూడా అనుకున్న దాని కంటే అధికంగా వచ్చింది. దోస కాయ సాగుతో పాటు బీరకాయ, దోసకాయ వంటి ఆఫ్ సీజన్ పంటలను కూడా పండించాడు. మొత్తానికి ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నాడు ముఖేష్.
వ్యవసాయ బావిని తవ్వి.. వర్షపు నీటిని అదిమిపట్టి
రాజస్థాన్ వంటి రాష్ట్రంలో వర్షాలు తక్కువే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు.. ముఖేష్ డ్రిప్ ఇరిగేషన్‌ను ఎంచుకున్నాడు. దీని కోసం తన పొలంలో 15 ఫీట్ల లోతులో 118×118 బావిని తవ్వాడు. వర్షాలు వచ్చిప్పుడల్లా ఆ నీటిని బావిలోకి మళ్లించేవాడు. పాలీహౌస్ రూఫ్‌ల నుంచి వచ్చే వర్షపు నీటిని కూడా జాగ్రత్తగా బావిలోకి మళ్లించి.. నీటి వనరులను పెంచుకున్నాడు. మొత్తంగా నీటి సమస్యను అధిగమించాడు ముఖేష్ గర్వ.
రూ. 60 లక్షల ఆదాయం.. రూ. 40 లక్షల లాభం..
ముఖేష్ గర్వ కష్టం ఫలించింది. అతని గ్రామంలో పలువురు రైతులకు ప్రేరణగా నిలిచాడు. సమీప గ్రామాల యువకులు కూడా ముఖేష్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. మొత్తంగా ఏడాదికి ముఖేష్ రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. తొలి రోజుల్లో వచ్చిన ఆదాయం కంటే ఇది పది రెట్లు ఎక్కువ. మూడు పాలీహౌస్‌ల నుంచి ఏడాదికి 2,400 క్వింటాళ్ల కూరగాయలను పండిస్తున్నాడు. క్వింటాల్‌కు రూ. 2500 వరకు ఆదాయం వస్తుంది. ఈ సాగు పెట్టుబడికి రూ. 18 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తంగా రూ. 60 లక్షల వరకు ఆదాయం సమకూరినప్పటికీ ఖర్చులు పోనూ రూ. 42 లక్షలు మిగులుబాటు ఉంది.
