Ts Secretariat | నూత‌న స‌చివాల‌యంలోకి.. ప్ర‌భుత్వ శాఖ‌ల త‌ర‌లింపు పనులు షురూ..

Ts Secretariat విధాత: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రెటేరియట్/9Ts Secretariat )బిల్డింగ్ కాంప్లెక్స్ ఆవరణలోకి ప్రభుత్వ శాఖలను తరలించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటల కు షిప్టింగ్ పనులు ప్రారంభించి 27, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ముగించున్నారు. ఏ అంతస్తులో ఏ డిపార్ట్ మెంట్ విభాగాలు ఉండాలనేది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నూతన భవనంలోకి షిప్టింగ్ పనులను […]

  • Publish Date - April 26, 2023 / 06:47 AM IST

Ts Secretariat

విధాత: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రెటేరియట్/9Ts Secretariat )బిల్డింగ్ కాంప్లెక్స్ ఆవరణలోకి ప్రభుత్వ శాఖలను తరలించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటల కు షిప్టింగ్ పనులు ప్రారంభించి 27, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ముగించున్నారు.

ఏ అంతస్తులో ఏ డిపార్ట్ మెంట్ విభాగాలు ఉండాలనేది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నూతన భవనంలోకి షిప్టింగ్ పనులను మొదలుపెట్టారు. పాత సచివాలయం కూల్చివేసిన తరువాత పలు శాఖల కార్యాలయాలను నగరంలోని సంబంధిత విభాగాల భవనాలకు తరలించిన విషయం తెలిసిందే. నూతన సచివాలయంలో శాఖల వారీగా అంతస్తుల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి.

26వ తేదీ బుధవారం తరలించనున్న శాఖలు

ఎస్సి డిపార్ట్ మెంట్ (గ్రౌండ్ ఫ్లోర్)
హోం డిపార్ట్ మెంట్ (ఫస్ట్ ఫ్లోర్)
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
సిఎఎఫ్ అండ్ సిఎస్ డిపార్ట్ మెంట్ (ఫోర్త్ ఫ్లోర్)
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (థర్డ్ ప్లోర్)
యువజన సర్వీసులు, పర్యాటకం (ఫోర్త్ ఫ్లోర్)
ఆర్ అండ్ బి, రవాణ (ఐదవ ఫ్లోర్)

27వ తేదీ గురువారం నాడు తరలించనున్న శాఖలు

మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (గ్రౌండ్ ఫ్లోర్)
విద్యాశాఖ (ఫస్ట్ ఫ్లోర్)
వైద్య, ఆరోగ్య శాఖ (సెకెండ్ ఫ్లోర్)
ప్లానింగ్ డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
బిసి వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (ఫోర్త్ ఫ్లోర్)
రెవెన్యూ డిపార్ట్ మెంట్ (గ్రౌండ్ ఫ్లోర్)
డిజాస్టర్ మేనేజిమెంట్ (గ్రౌండ్ ఫ్లోర్)
విద్యుత్ డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
ఐటి అండ్ సి డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
అడవులు, పర్యావరణ డిపార్ట్ మెంట్ (ఫోర్త్ ఫ్లోర్)

28వ తేదీ శుక్రవారం తరలించనున్న డిపార్ట్ మెంట్లు

లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్ మెంట్ (గ్రౌండ్ ఫ్లోర్)
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ (ఫస్ట్ ఫ్లోర్)
పశు సంవర్థక, డెయిరీ డిపార్ట్ మెంట్ (సెకండ్ ఫ్లోర్)
ఎ అండ్ సి డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ (ఫోర్త్ ఫ్లోర్)
మహిళా, శిశు సంక్షేమం (థర్డ్ ఫ్లోర్)
ఐ అండ్ సి డిపార్ట్ మెంట్ (థర్డ్ ఫ్లోర్)
లా డిపార్ట్ మెంట్ (ఫోర్త్ ఫ్లోర్)
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (ఐదవ ఫ్లోర్)
ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ (సెకెండ్ ఫ్లోర్)