Site icon vidhaatha

TSPSC పేపర్‌ లీక్‌.. పోలీసుల అదుపులో 13మంది

విధాత‌: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC)పేపర్‌ లీక్‌(paper leak) వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్‌గా గుర్తించారు. ఆయన సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఏగా పనిచేస్తున్నాడు.

పోలీసులు అదుపులో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌ కూడా ఉన్నారు. పేపర్‌ లీకేజీకు మహిళ ద్వారా అభ్యర్థులతో రూ.10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. మహిళకు సహకరించే క్రమంలో ఈ వ్యవహారమంతా బైటపడింది. దీనిపై పోలీసులు రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది.

Exit mobile version