Site icon vidhaatha

TSPSC పేపర్ లీక్‌.. కేసు నమోదు చేసిన ED

విధాత: తెలంగాణలో ఈడీ దూకుడు పెంచింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఈడీ కేసు నమోదు చేసింది. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసింది.

పేపర్‌ లీక్‌పై సిట్‌తో పాటుగా ఈడీ విచారణ చేయనున్నది. హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది.

ఇప్పటికే అరెస్టైన 15 మందిని ఈడీ తిరిగి విచారించనున్నది. అవసరమైన పక్షంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు, కమిషన్‌ సెక్రటరీ విచారించే అవకాశం ఉన్నది.

రెండు ముఖ్యమైన కేసులపై ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు డేటా లీక్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. బ్యాంకులతో పాటు పలు సంస్థలకు నోటీసులు ఇవ్వనున్నది.

Exit mobile version