Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. సోనూసూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప సహా పలువురు సెలబ్రిటీలకు చెందిన రూ.7.93 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

Betting Apps Case

న్యూఢిల్లీ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ సినీ సెలబ్రెటీలకు, క్రికెటర్లకు షాక్ ఇచ్చింది. సినీ నటులు సోనుసూద్, నేహాశర్మ, ఊర్వశీ రౌతెలా, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రా, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువ రాజ్ సింగ్ ఆస్తులను అటాచ్ చేసింది. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ కోసం వారంతా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. తాజాగా అటాచ్ చేసిన రూ.7.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.19.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.

బెట్టింగ్ యాప్‌ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలు ఈ వ్యవహారంపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులను అధికారులు వరుసగా విచారిస్తున్నారు. తెలంగాణలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులను, యూ ట్యూబర్లను, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్ ను కూడా సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. వీరిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి.

ఇవి కూడా చదవండి :

Digital Bharat Fund | ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు
KTR vs Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్

Latest News