Komatireddy Rajagopal Reddy : త్వరలోనే నాకు మంత్రి పదవి రాబోతుంది

త్వరలోనే తనకు మంత్రి పదవి దక్కబోతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Komatireddy Rajagopal Reddy

విధాత : త్వరలోనే నాకు మంత్రి పదవి రాబోతుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కొత్త సర్పంచ్ ల అభినందన కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి..ఇన్నాళ్లు ఓపిక పట్టామని.. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా సేవలను గుర్తించిన అధిష్టానం కేబినెట్ లోకి తీసుకోబోతుందని తెలిపారు. పదవులతో సంబంధం లేకుండా నియోజవర్గం అభివృద్దికి తాను నిరంతరం పాటుపడుతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీతోనే భువనగిరి ఎంపీగా రాజకీయ ప్రవేశం చేసిన రాజగోపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తలపడ్డారు. అయితే కేసీఆర్ సర్వశక్తులొడ్డటంతో పాటు వామపక్షాల సహకారంతో ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో సఫలీకృతులయ్యారు. అనంతరం వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా తిరిగి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అయితే కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని…హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి రెండేళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంపైన, సీఎం రేవంత్ రెడ్డిపైన ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆశావహులు మాత్రమే 10మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వవస్థీకరణ చేసిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఈ ధఫా మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

TATA Sierra vs MG Hector : టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!
Ponnam Prabhakar : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.806.35 రాయితీ

Latest News