Sudarshan Reddy-Premsagar Rao| సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కీలక పదవులు

మంత్రి పదవులు ఆశించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవులు అప్పగించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ..ఆయనకు ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి కోరుతున్న ప్రేమ్ సాగర్ రావును సివిల్ సఫ్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విధాత, హైదరాబాద్ : మంత్రి పదవులు ఆశించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)కి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(Premsagar Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక పదవులు అప్పగించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ..ఆయనకు ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి కోరుతున్న ప్రేమ్ సాగర్ రావును సివిల్ సఫ్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికి సర్దుకోండి…

తాజాగా అజారుద్ధీన్ ను మైనార్టీ కోటాలో మంత్రిగా తీసుకుని మంత్రివర్గం విస్తరించిన కాంగ్రెస్ అధిష్టానం తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్లుగా సమాచారం. దీంతో వారిద్దరిని బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానరం వారికి మంత్రి పదవులకు ప్రత్యామ్నాయంగా కేబినెట్ హోదాతో కూడిన పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ.. ఆరుగ్యారంటీల అమలు బాధ్యతలకు అప్పగించింది. ఇక ప్రేమ్ సాగర్ రావును సివిల్ సఫ్లయ్ కార్పోరేషన్   చైర్మన్ గా నియమించింది. ఇద్ధరికి కూడా కేబినెట్ హోదాతో ఆయా పదవులను కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ రెండు భర్తీ చేస్తారా…పునర్ వ్యవస్థీకరణ వరకు అంతేనా..?

అయితే మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయబోతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవుల రేసు నుంచి సుదర్శన్ రెడ్డిని, ప్రేమ్ సాగర్ రావును తప్పించేయడంతో ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు, ఎస్టీ కోటా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లు రేసులో నిలిచారు. వీరితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఇప్పట్లో మంత్రివర్గం విస్తరణ ఉండదని..భవిష్యత్తులో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయవచ్చన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని, ప్రస్తుత మంత్రుల్లో నలుగురిపై వేటు పడవచ్చని..అయితే అందుకు ఇంకా చాల సమయం పట్టవచ్చని అంటున్నారు.