న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక సర్వే దేశంలో జంక్ ఫుడ్ ప్రచార ప్రకటనలపై కీలక సూచనలు చేసింది. అధిక కొవ్వు, చక్కెర కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించాలని సూచించింది. అంతేకాకుండా చిన్నారుల పాల ఉత్పత్తుల మార్కెటింగ్ పైన ఆంక్షలు విధించాలని పేర్కొంది. శీతల పానీయాల మార్కెటింగ్ ను కూడా పరిమితం చేయాలని పిలుపునిచ్చింది.
జంక్ ఫుడ్ ఉత్పత్తులపై అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంత వినియోగించారో హెచ్చరించేలా న్యూట్రిషన్ లేబుల్‌ను ముద్రించాలని సూచించింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి ఆర్థిక సర్వేలో నివేదిస్తారు.
ఇవి కూడా చదవండి :
జాతీయ జన గణనలో ఓబీసీల కాలమ్ ఎక్కడా? : కవిత ధ్వజం
Nalgonda Municipal Corporation Elections : నల్లగొండ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ !
