విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1090 తగ్గి.. రూ. 1,62,220కి తగ్గింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,48,700వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు సైతం దిగివచ్చాయి. కిలో వెండి ధర రూ.10,000తగ్గి.. రూ.2,90,000వద్ద కొనసాగుతుంది.
పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు కూడా బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తోంది. తాజాగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రముఖ మార్కెట్ నిపుణులు జేపీ మోర్గాన్ 2026 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు దాదాపు 6,300 డాలర్లకు చేరతాయని అంచనా వేస్తున్నారు. ఇది కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు, ప్రైవేట్ రంగం నుండి పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా వచ్చిన అంచనగా తెలిపారు.
ఇవి కూడా చదవండి :
LPG Gas Shortage | గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ కట్టెల పొయ్యిలు..! పూరీ, వడ, రోటీ బంద్..!!
