Komatireddy Rajagopal Reddy | సొంత రూల్స్ చెల్లవు…రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ షాక్! మునుగోడులో మూసివేసిన వైన్ షాపులను దగ్గరుండి తెరిపించిన పోలీసులు.

Komatireddy Rajgopal Reddy

విధాత : నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ శాఖ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒకటి తర్వాతనే వైన్సులు తెరవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు తన మాటను బేఖతార్ చేసి తెరిచిన వైన్స్ లను స్వయంగా రాజగోపాల్ రెడ్డి మూసివేయించారు. ఎమ్మెల్యే వైఖరితో రాష్ట్రం అంతటా ఎక్సైజ్ శాఖ ఒక పాలసీ, మునుగోడులో మరో పాలసీ అమలవుతూ తాము నష్టపోతున్నామనంటూ వైన్స్ యజమానులు ఆందోళన వెలిబుచ్చారు.

ఈ వివాదంపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ శాఖ పోలీసులు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించి సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూర్ మండల కేంద్రంలల్లో వైన్స్ లను దగ్గరుండి మరీ తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగేలా చూశారు. అయితే ఎక్సైజ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాజగోపాల్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు అధికారులతో, వైన్ షాప్ యజమానులతో వాగ్వివాదానికి దిగి..వైన్స్ ల ముందు ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్, సివిల్ పోలీసులు వైన్స్ ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. తన ఆదేశాలకు భిన్నంగా ఎక్సైజ్ శాఖ వైన్స్ లను తెరిపించడంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Cyber Fraud | సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టే యోచనలో కేంద్రం.. ‘కిల్‌ స్విచ్‌’ పేరుతో ప్రత్యేక వ్యవస్థ..!
Minnesota Immigration Raid | అమానవీయం.. ఐదేళ్ల బాలుడిని ఎరగా వేసి తండ్రిని నిర్బంధించిన అమెరికా అధికారులు

Latest News