Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కలయికలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అఖండ 2: తాండవం’ ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. తొలి భాగం సృష్టించిన సంచలనం వల్ల సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అనంతరం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోకుండా నిలబెట్టేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్రయూనిట్ తాజాగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అడుగుపెట్టింది. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే వరకూ సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా లాంగ్ రన్‌లో నిలదొక్కుకోవాలని, కలెక్షన్లు స్టెడీగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే బాలయ్య అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
అక్కడ భారీ ఫాలోయింగ్..
ఒకవైపు సినిమా థియేటర్లలో రన్ అవుతుండగానే ప్రమోషన్స్ ఆపకుండా కొనసాగించాలన్నది టీమ్ స్పష్టమైన స్ట్రాటజీగా కనిపిస్తోంది. వారణాసిలో బాలయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు. తెలుగు ప్రేక్షకులే కాదు, ఉత్తర భారతీయ ప్రేక్షకులు కూడా ఆయన్ను గుర్తుపట్టి సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. సాధారణంగా సీరియస్‌గా కనిపించే బాలయ్య, అక్కడ మాత్రం ఎంతో కూల్‌గా వ్యవహరించారు. అభిమానులు అడిగిన వెంటనే చిరునవ్వుతో సెల్ఫీలు ఇచ్చారు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ అందరినీ పలకరించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో నార్త్ బెల్ట్‌లో కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే, హిందీ మార్కెట్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ‘అఖండ’ మొదటి భాగం హిందీలో మంచి రన్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే మేజిక్‌ను ఈసారి కూడా రిపీట్ చేయాలనే లక్ష్యంతో వారణాసి టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, పబ్లిక్‌లో కనిపించడం ద్వారా సినిమాపై మళ్లీ బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అవతార్ ఎఫెక్ట్..
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన విజువల్ వండర్ ‘అవతార్ 3’ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ భారీ కాంపిటీషన్‌ను తట్టుకుని ‘అఖండ 2’ థియేటర్లలో నిలబడాలంటే స్ట్రాంగ్ ప్రమోషన్స్ తప్పనిసరి అనే భావనతోనే బాలయ్య, బోయపాటి స్వయంగా రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
కెరీర్‌లో సాధారణంగా ప్రమోషన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని బాలకృష్ణ, ఈసారి మాత్రం సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు ముంబై టూర్, ఇప్పుడు రిలీజ్ తర్వాత వారణాసి యాత్ర – ఇవన్నీ ‘అఖండ 2’ కోసం ఆయన చేస్తున్న గట్టి ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. మరి ఈ వారణాసి సెంటిమెంట్, దూకుడైన ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమా బాక్సాఫీస్ రన్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
