Akhanda 2 | అఖండ 2 విల‌న్ కూతురు ఇంత అందంగా ఉందేంటి.. చూస్తే స్ట‌న్ అవుతారు..!

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.సనాతన ధర్మం, హిందూత్వం వంటి అంశాలను బలమైన కథనం, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో బోయపాటి శ్రీను పూర్తిగా విజయవంతమయ్యారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ మార్క్ డైలాగులు, ఉగ్ర యాక్షన్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించి మరోసారి తన నటనకు కొత్త స్థాయిని తీసుకెళ్లారు. హీరోయిన్‌గా సంయుక్త మేనన్ నటించ‌గా, ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తారాగణం విషయానికి వస్తే, ‘బజరంగీ భాయిజాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురు పాత్రలో ఆకట్టుకుంది. ఆమె ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా కదిలిస్తున్నాయి. వీరితో పాటు అచ్యుత్ కుమార్, విజయ్ చంద్రశేఖర్, పూర్ణ, హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప, రాన్సన్ విన్సెంట్, కబీర్ దుల్హన్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.

ఈ సినిమాకు విలన్ల పాత్రలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాంత్రికుడైన నేత్ర పాత్రలో ఆది పినిశెట్టి భయానకమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ప్రధాన విలన్‌గా చైనా మిలిటరీ అధినేత పాత్రలో నటించిన సంగే షెల్ట్రిమ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సినిమాకు మరో హైలైట్‌గా నిలిచాడు. అతనికి సహాయకుడిగా ఛాంగ్ పాత్రలో బెంగాళీ ప్రముఖ నటుడు శ్వాస్థ ఛటర్జీ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గతంలో ‘కల్కి’ సినిమాలో విలన్‌గా కనిపించిన శ్వాస్థ, ‘అఖండ 2’తో మరోసారి తెలుగు తెరపై మెప్పించాడు. ప్రముఖ నటుడు సుబేందు ఛటర్జీ కుమారుడైన శ్వాస్థ, ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, శ్వాస్థ ఛటర్జీ కూతురు హియా ఛటర్జీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్ల నుంచి భారీ స్పందన పొందుతున్నాయి. తాత, తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ హియా కూడా త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

Latest News