TSPSC | రేపే గ్రూప్-4 ఎగ్జామ్.. ఈ సూచ‌న‌లు మ‌రిచిపోవ‌ద్దు..!

TSPSC | జులై 1వ తేదీన గ్రూప్-4 రాత‌ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ స‌ర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,878 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. 9.51 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు గ్రూప్‌-4 ఎగ్జామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే అభ్య‌ర్థులు త‌ప్ప‌కుండా ఈ సూచ‌న‌లు పాటించాల్సిందే. 1. గ్రూప్-4 ప‌రీక్ష ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్ల‌లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే రెండు సెష‌న్ల‌కు 15 నిమిషాల ముందే ప‌రీక్షా […]

  • Publish Date - June 30, 2023 / 12:27 AM IST

TSPSC | జులై 1వ తేదీన గ్రూప్-4 రాత‌ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ స‌ర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,878 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. 9.51 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు గ్రూప్‌-4 ఎగ్జామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే అభ్య‌ర్థులు త‌ప్ప‌కుండా ఈ సూచ‌న‌లు పాటించాల్సిందే.

1. గ్రూప్-4 ప‌రీక్ష ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్ల‌లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే రెండు సెష‌న్ల‌కు 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రాల గేట్ల‌ను మూసివేయ‌నున్నారు. దీంతో నిర్ణీత స‌మ‌యంలో ప‌రీక్షా కేంద్రాల‌కు అభ్య‌ర్థులు చేరుకోవాలి.

2. పేప‌ర్-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్ -2 సెక్ర‌టేరియ‌ల్ ఎబిలిటీస్ మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

3. అభ్య‌ర్థులు హాల్ టికెట్‌తో పాటు త‌మ వెంట క‌చ్చితంగా ప్ర‌భుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. ఆధార్, ఓట‌ర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.

4. గ్రూప్-4 ఎగ్జామ్‌కు అభ్య‌ర్థులు భారీ సంఖ్య‌లో హాజ‌రయ్యే అవ‌కాశం ఉన్నందున ఈ సారి వేలిముద్ర‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. నామిన‌ల్ రోల్‌లో సంత‌కం చేసిన త‌ర్వాత ఎడ‌మ చేతి బొట‌న వేలిముద్ర కోసం ప్ర‌త్యేక స్థ‌లాన్ని కేటాయించారు. అందులో వేలిముద్ర వేయాలి.

5. అభ్య‌ర్థులు ప్ర‌శ్న‌ప‌త్రంపై స‌మాధానాల‌ను మార్క్ చేయ‌కూడ‌దు. ఓఎంఆర్ షీట్‌లో హాల్ టికెట్, ప్ర‌శ్న‌ప‌త్రం నంబ‌ర్, ప‌రీక్షా కేంద్రం కోడ్, అభ్య‌ర్థి పేరుతో పాటు సంత‌కం చేయాలి.

6. ఓఎంఆర్ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్ర‌శ్న‌ప‌త్రం నంబ‌ర్ రాయాలి. ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉప‌యోగిస్తే ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తారు.

7. అభ్య‌ర్థులు ఎల‌క్ట్రానిక్ ప‌రికరాలు, తాళాలు, బ్యాగులు, ప‌ర్సులు తీసుకెళ్లొద్దు. అభ్య‌ర్థులు షూ మాత్ర‌మే ధ‌రించాలి.. షూ వేసుకొని వెళ్లొద్దు.

Latest News