Mumbai
విధాత: కంచె చేను మేసిన చందంగా.. విద్యార్థులకు విద్యాబుద్ధులు అండగా ఉండాల్సిన ఓ ట్యూషన్ మాస్టర్ బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఒకసారి కాదు.. 2 సార్లు ఏకంగా తొమ్మిదేండ్లుగా. తనను గుడ్డిగా నమ్మిన బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి బాలికను స్కూల్‌కు వెళ్లకుండా మాన్పించాడు. రోజు లైంగిక వేధింపులు తాళలేక తన బాధను స్నేహితురాలికి చెప్పగా, ఆమె సహకారంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 55 ఏళ్ల ప్రైవేట్ ట్యూషన్ టీచర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై మోరిన్ లైన్స్‌లోని ధోభిఘాట్ ప్రాంతంలో అనిల్ పరదేశి తన భార్యతో కలిసి ట్యూషన్ క్లాసులు తీసుకుంటాడు. తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే ఓ బాలికను ఆరేళ్ల వయసులో నుంచే అతడు వేధింపులు ప్రారంభించాడు. నిందితుడిపై బాలిక తండ్రికి ఉన్న నమ్మకం, బాలికను ఇంత కాలం వేధించడానికి అతనికి సహాయపడింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక ముంబైలో తన తండ్రి, ఇద్దరు తోబుట్టువులతో నివసిస్తుంది. ఆమె తల్లి భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బాలిక తండ్రి హోటల్ మేనేజర్‌గా పనిచేసేవాడు. బాలిక తన అఘాయిత్యం గురించి ఎవరితోనైనా చెప్తుందనే భయంతో, పాఠశాల వాతావరణం బాగుండదని, మీ బిడ్డ భవిష్యత్తును చెడగొడుతుందని తండ్రిని ఒప్పించి ఆమె పాఠశాల మాన్పించేలా చేశాడు.
ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఆ బాలిక.. మూడేళ్లుగా పాఠశాలకు స్వస్తి పలికి ట్యూషన్‌కు మాత్రమే వచ్చేలా చేశాడు. ఆమె తండ్రి కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగాల్‌లో ఉన్న సమయంలో నిందితుడు దాదాపు ప్రతిరోజూ వచ్చి లైంగికదాడి చేసేవాడు.
ఇటీవల ఓ స్నేహితులు వచ్చి పాఠశాలకు ఎందుకు రావడం లేదని అడుగగా, లైంగిక వేధింపుల గురించి వివరించింది. ఇద్దరు ఆమె తండ్రికి టీచర్ అఘాయిత్యాల గురించి చెప్పి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్టు చేసి, పోక్సో నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అనిల్ అఘాయిత్యాలు భార్యకు తెలియవని పోలీసులు తెలిపారు.