Suspend | విధాత: ఎల్‌బీ నగర్‌లో లక్ష్మి అనే మహిళను అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో రాత్రంతా నిర్భంధించి థర్డ్‌డిగ్రీ ప్రయోగించి విచక్షణారహితంగా కొట్టిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
బాధిత మహిళ తరుపున బంధువులు, స్థానికులు ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా ఈ వివాదంపై ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు కానిస్టేబుల్స్ శివకుమార్, సుమలతలను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు.