విధాత: నల్గొండ జిల్లా చండూరు మండలం ధోని పాముల గ్రామంలో ఇద్దరూ ఉపాధి హామీ మహిళా కూలీలు చెరువులో పడి చనిపోయారు.
గ్రామానికి చెందిన చినరాజు లింగమ్మ ,సూర లక్ష్మమ్మలు ఉపాధి హామీ పనికి వెళ్లి పక్కనే ఉన్న చేపల చెరువులో కాళ్లు చేతులు కడుకుందామని వెళ్లగా అందులో జారిపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.