UPA | ఇక యూపీఏ క‌నుమ‌రుగే..! బీజేపీని ఎదుర్కొనేందుకు స‌రికొత్త కూటమి..!

UPA విధాత‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఓడించేందుకు దేశంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో 17 పార్టీలు పాల్గొంటే తాజా సమావేశానికి 24 పార్టీలు హాజరు కానున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు ఆ కూటమిలోకి వెళ్లిపోయింది. తాజా స‌మావేశం కాంగ్రెస్ […]

  • Publish Date - July 17, 2023 / 09:44 AM IST

UPA

విధాత‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఓడించేందుకు దేశంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో 17 పార్టీలు పాల్గొంటే తాజా సమావేశానికి 24 పార్టీలు హాజరు కానున్నాయి.

నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు ఆ కూటమిలోకి వెళ్లిపోయింది. తాజా స‌మావేశం కాంగ్రెస్ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి బెంగ‌ళూరులో ఏర్పాట్లు పూర్త‌య్యాయి.


అయితే యునైటెడ్ ప్రొగ్రెసివ్ అల‌య‌న్స్‌(యూపీఏ) పేరును మార్చాల‌ని బీజేపీ వ్య‌తిరేక పార్టీలు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో స‌హా బీజేపీ వ్య‌తిరేక పార్టీలకు సంబంధించి కొత్త కూట‌మి ఏర్పాటు చేయ‌నున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మి కేంద్రంలో 2004 నుంచి 2014 వ‌ర‌కు అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. యూపీఏ కూట‌మికి సోనియా గాంధీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు.

యూపీఏ కూట‌మి పేరు మార్పుపై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సోమ‌వారం మీడియాకు స్ప‌ష్ట‌తనిచ్చారు. యూపీఏ పేరు మార్పుపై మంగ‌ళ‌వారం జ‌రిగే స‌మావేశంలో స‌మిష్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఏం విష‌యాలు చ‌ర్చిస్తామ‌నేది ఇప్పుడే చెప్ప‌లేను. కూట‌మి పేరు మార్పుపై కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి చ‌ర్చించి, యూపీఏ పేరు మార్పుపై ఏక‌గ్రీవ తీర్మానం చేస్తామ‌ని వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై సుదీర్ఘ చ‌ర్చ చేస్తామ‌న్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇందుకు ఓ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. రేపు సాయంత్రం మీడియాకు విప‌క్షాల భేటీకి సంబంధించిన అన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

Latest News