Upasana | వామ్మో.. కూతురి కోసం రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ఒక అడవినే సృష్టిస్తున్నారుగా..!

Upasana: ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక మ‌ధుర‌మైన ఘ‌ట్టం ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ జీవితంలో కూడా ఎన్నో మ‌ధుర‌మైన స్మృతులు ఉండి ఉండవ‌చ్చు, అలానే ఉపాస‌న జీవితంలో కూడా తీపి జ్ఞాప‌కాలు ఎన్నో ఉంటాయి. అయితే అన్నింటిక‌న్నా జూన్ 20 వారికి చాలా స్పెష‌ల్ అని చెప్ప‌వ‌చ్చు. ఆ రోజు తెల్ల‌వారుఝామున ఉపాస‌న పండంటి ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఫ్యామిలీతో పాటు వారి స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అందు కార‌ణం దాదాపు […]

  • Publish Date - July 15, 2023 / 02:29 AM IST

Upasana: ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక మ‌ధుర‌మైన ఘ‌ట్టం ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ జీవితంలో కూడా ఎన్నో మ‌ధుర‌మైన స్మృతులు ఉండి ఉండవ‌చ్చు, అలానే ఉపాస‌న జీవితంలో కూడా తీపి జ్ఞాప‌కాలు ఎన్నో ఉంటాయి. అయితే అన్నింటిక‌న్నా జూన్ 20 వారికి చాలా స్పెష‌ల్ అని చెప్ప‌వ‌చ్చు.

ఆ రోజు తెల్ల‌వారుఝామున ఉపాస‌న పండంటి ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఫ్యామిలీతో పాటు వారి స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అందు కార‌ణం దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులు కావ‌డం. ఇన్నేళ్ల త‌ర్వాత వారు త‌ల్లిదండ్రులు కావ‌డంతో పాప‌పై ప్ర‌త్యేక శ్రద్ధ చూపుతున్నారు. పాప‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జ‌రుపుతున్నారు.

జూన్ 30న‌ సాంప్రదాయ బద్దంగా మెగా వారసురాలికి బార‌సాల కార్య‌క్ర‌మం చేసి క్లీంకార అని పేరు పెట్టారు. లలితా సహస్ర నామంలోని పదాలు కలిసేలా.. అమ్మవారి ఆశీర్వాదం శక్తి తోడయ్యేలా ఆ పేరు పెట్టామ‌ని చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశారు.

ఇక బిడ్డ పుట్టిన‌ప్పటి నుండి రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు కూతురు ఆల‌నా పాల‌నా విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మెగా ప్రిన్సెస్ క్లీంకార కోసం రాంచరణ్, ఉపాసన ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేసిన‌ట్టు ఈ వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది. రీసెంట్‌గా ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

ఇందులో చిన్నారి పెరిగేందుకు మంచి వాతావరణం ఉండేలా.. పిల్లలు కోరుకునే బొమ్మలు ఉండేలా రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు డిజైన్ చేయించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. పవిత్ర రాజారామ్ అనే ఆర్కిటెక్ట్ తో ఇలా అద్భుతంగా ఫారెస్ట్ థీమ్‌తో డిజైన్ చేయించార‌ట‌.

పిల్లలు ఎలా అయితే కోరుకుంటారో, ఫారెస్ట్ లోనే వివిధ జంతువులు ఎలా ఉంటాయో అలా బొమ్మలు, చెట్లు ఉండే బోర్డులు, సాఫ్ట్ గా వైట్ థీమ్ లో ఉండే సోఫాలు మ్యాట్ లు, టేబుల్స్ ఇలా ఆహ్లాద భరితంగా గదిని డిజైన్ చేయించారు. క‌ప్ బోర్డ్స్ లో కూడా వివిధ జంతువుల బొమ్మ‌లు ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ కాగా,ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

Latest News