Klin Kaara Konidela | ‘క్లీంకారా’ కొణిదెల.. నామకరణ పోస్టర్‌లో ఆ దేవత పేరు గమనించారా?

Klin Kaara Konidela విధాత‌: పెళ్లయిన దాదాపు పదేళ్ళ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ ఇటీవల జన్మించింది. ఈ ఆనందాన్ని అటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులతో ఆనందంగా పంచుకుని మురిసిపోయారు. ఇక బిడ్డ పుట్టిన పదకొండవ రోజున పాపకు నామకరణం, ఉయ్యాలలో వేసే కార్యక్రమం ఘనంగా జరిపారు. ముందు పాపకు ఆంజనేయస్వామి పేరు కలిసేలా ‘అంజలి’ అనే పేరు పెడతారని అంతా అన్నారు కానీ.. బిడ్డ […]

  • Publish Date - July 3, 2023 / 01:32 AM IST

Klin Kaara Konidela

విధాత‌: పెళ్లయిన దాదాపు పదేళ్ళ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ ఇటీవల జన్మించింది. ఈ ఆనందాన్ని అటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులతో ఆనందంగా పంచుకుని మురిసిపోయారు. ఇక బిడ్డ పుట్టిన పదకొండవ రోజున పాపకు నామకరణం, ఉయ్యాలలో వేసే కార్యక్రమం ఘనంగా జరిపారు.

ముందు పాపకు ఆంజనేయస్వామి పేరు కలిసేలా ‘అంజలి’ అనే పేరు పెడతారని అంతా అన్నారు కానీ.. బిడ్డ పేరు అమ్మవారి నామాలైన లలితా సహస్ర నామాలలోని పేరును ఎంచుకోవడం విశేషం.

అయితే ఈ సందర్భంగా పాపను మీడియాకు కనిపించకుండానే ఫోటోలకు ఫోజులిచ్చారు మెగా ఫ్యామిలీ. పాపను ఉయ్యాలలో వేస్తూ చిరంజీవి దంపతులు, అటు ఉపాసన తల్లిదండ్రులు ఫోటో దిగారు. మరో ఫోటోలో రామ్ చరణ్ దంపతులు, చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు కలిసి ఉన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి.

ఈ ఫొటోలతో పాటు నామకరణానికి సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక దేవత పేరు చెప్పి.. ఆ దేవత ఆశీస్సులతో అంటూ పాప పేరు రివీల్ చేశారు. పాపకు క్లీంకార కొణిదెల అని గ్రాండ్‌గా ప్రకటించారు.

మెగాప్రిన్సెస్‌కు పెట్టిన పేరు‌పై నెట్టింట ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంగ్లీషు పదాల్లో KKK అనే విధంగా ఈ పేరును పెట్టారు. దీనికి అర్థం ఏమై ఉంటుందా అని అభిమానులు చర్చించుకున్నారు. ఉయ్యాలలో వేసే కార్యక్రమం కాగానే చిరంజీవి, రామ్ చరణ్ పాప పేరును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నా మనవరాలికి ‘క్లీంకార కొణిదెల’ అనే నామకరణం చేశామని తెలిపారు. క్లీం కార అంటే ప్రకృతి స్వరూపం, అమ్మవారి శక్తి అనే అర్థం వస్తుందని తెలిపారు.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. విడుదల చేసిన పోస్టర్‌లో స్టార్టింగ్ ‘‘చంచు తెగ దేవత బావురమ్మ దేవి ఆశీస్సులతో’’ అంటూ ప్రకటించారు.

ఈ దేవత పేరు ఇంత వరకు ఎక్కడా వినబడలేదు. అలాగే చంచు తెగ దేవతని మెగా, కామినేని ఫ్యామిలీలలో ఏ ఫ్యామిలీ కొలుస్తుందో అనేలా టాక్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ అయితే ఆంజనేయ స్వామి భక్తులు.. కానీ ఇక్కడ చంచు తెగ దేవత ఆశీస్సులు అని అన్నారు అంటే.. కచ్చితంగా కామినేని వారి కొలిచే దేవతే అనేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఉపాసన పుట్టింటి‌కి గౌరవమిస్తూ.. ఆమె కోరిక ప్రకారం, ఆ దేవత ఆశీస్సులతో పాపకి ‘క్లీం కార’ అనే నామకరణం చేసినట్లుగా అయితే ప్రస్తుతానికి తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరణను మెగా, కామినేని ఫ్యామిలీల నుంచి ఆశించడం కరెక్ట్ కాదేమో.

Latest News