Urvashi Rautela | ఊర్వశీ రౌతేలా.. పరిచయం అక్కర్లేని పేరు. మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్‌గా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నది. అందం, డ్యాన్స్‌తో కుర్రకారును చిత్తు చేస్తున్నది. ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో భారీగా అభిమానులను సంపాదించుకున్నది. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఏజెంట్, స్కంద తదితర సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో నర్తించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమ రెండు మనసుల కలయిక అని.. అది రెండు వైపులా ఉండాలని.. ఇద్దరు వ్యక్తులు సంపూర్ణ అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టాలని చెప్పింది.
నమ్మకం, గౌరవం ఎంతో ముఖ్యమన్న ఊర్వశీ వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో జీవితాంతం కలిసి నడుస్తూ బాధ్యతలను నిర్వర్తించాలని చెప్పింది. తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే జిమ్నాస్టిక్స్.. ఏరోనాటికల్ ఇంజినీర్, ఐఏఎస్ అధికారినో అయ్యుండేదాన్ని అని తెలిపింది. 15 ఏళ్ల వయసులో తన ఫ్యాషన్ జర్నీని ప్రారంభించిన ఊర్వశి మిస్ టీన్ ఇండియాగా 2009లో నిలిచింది. లాక్మే ఫ్యాషన్ వీక్, అమెజాన్ ఫ్యాషన్ వీక్, బాంబే ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్ షోల్లో ర్యాంప్ వాక్ చేసి టాపర్‌గా నిలిచింది. బ్యూటీ క్వీన్, ఇండియన్ ప్రిన్సెస్ 2011, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 తదితర టైటిల్స్ సొంతం చేసుకున్నది. 2013లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సన్నీ డియోల్ ‘సింగ్ సాహిబ్ ది గ్రేట్’ చిత్రంలో నటించింది. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో ప్లాప్‌గా నిలిచాయి. హనీసింగ్ మ్యూజిక్ ఆల్బమ్ లవ్ డోస్‌లో డ్యాన్స్ భారీగా అభిమానులను సంపాదించుకన్నది. తెలుగులో వాల్తేరు వీరయ్య చిత్రంలో ఐటమ్ సాంగ్స్‌లో మెరిసింది. ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. అయితే, తెలుగులో ‘బ్లాక్ రోస్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే, అనివార్య కారణాలతో చిత్రం విడుదల నిలిచిపోయింది. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న ఎన్బీకే 109లో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నది.