Uttam Kumar Reddy | కాంగ్రెస్ ఉప్పెనలో బీఆరెస్ సర్కారు కొట్టుకుపోనుంది: ఎంపీ ఉత్తమ్

రెండు సీట్లపై నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్‌దే పీసీసీ మాజీ చీఫ్ ఎన్‌.ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam Kumar Reddy | విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉప్పెనలో అవినీతి బీఆరెస్‌ ప్రభుత్వం కొట్టుపోతుందని పీసీసీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని, దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ముస్లింలకు12 […]

  • Publish Date - August 30, 2023 / 09:36 AM IST

  • రెండు సీట్లపై నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్‌దే
  • పీసీసీ మాజీ చీఫ్ ఎన్‌.ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy | విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉప్పెనలో అవినీతి బీఆరెస్‌ ప్రభుత్వం కొట్టుపోతుందని పీసీసీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని, దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ముస్లింలకు12 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క వాగ్ధానాన్ని కేసీఆర్ అమలు పరచలేదన్నారు.

ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ ఏ కలలోనైనా బ్రతకవచ్చని, మేం మాత్రం అధికారంలోకి వస్తామని నమ్ముతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ వంటి ఇంత దిగజారుడు ప్రభుత్వం, ఇంత దోపిడీ గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. బీఆరెస్‌ ఎమ్మెల్యేలు దోచుకోవడమే పనిగా, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ సాండ్, ల్యాండ్‌, వైన్‌, మైన్‌ వంటి అన్ని అక్రమ వ్యాపారాల్లో దోచుకుంటూ ప్రజలని హింసిస్తున్నారన్నారు. కర్ణాటక ప్రభుత్వంపై కేసీఆర్ మాట్లాడిన మాటలు ఖండిస్తున్నానన్నారు.

కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుం దన్నారు. కర్ణాటకలో రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. ఈరోజు నుంచి గృహలక్ష్మి పాలసీలో భాగంగా ప్రతి మహిళకి 2000 రూపాయలు ఇస్తున్నామని, ఈ పథకాన్ని రాహుల్‌గాంధీ, ఖర్గేలు బుధవారం ప్రారంభించారన్నారు. అన్నభాగ్య స్కీమ్ కింద పది కిలోల బియ్యం అక్కడి ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఐదు గ్యారెంటీ స్కీమ్ లలో నాలుగు పథకాలను అమలుచేస్తున్నామని, వచ్చే నెలలో ఇంకో పథకం కూడా ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల ఖరారును త్వరగా పూర్తి చేయాలని తాను కోరుతున్నానన్నారు. కుటుంబానికి రెండు సీట్ల కేటాయింపు ఉదయ్‌ పూర్‌ డిక్లరేషన్‌కు అనుగుణంగా సాగుతుందన్నారు. పార్టీలో ఐదేళ్ల కంటే ఎక్కువ సీనియార్టీ తమకుందన్నారు. తాను హుజూర్‌నగర్‌లో, తన సతీమణి పద్మావతి కోదాడలో పోటీ చేస్తారని, 50వేల మెజార్టీతో గెలుస్తామన్నారు.

లెఫ్ట్ పార్టీలతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు నాకు తెలియదన్నారు. పార్లమెంటు స్థానం పరిధిలో బీసీలకు రెండు టికెట్ల కేటాయింపు దిశగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం టికెట్‌ త్యాగానికి సిద్ధమని చెప్పిన విషయం నాకు తెలియదన్నారు. బాల్క సుమన్ కోవర్టుల మాటలకు కూడా నేను సమాధానం చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మా గురించి మాట్లాడడం పక్కన పెట్టి కిషన్ రెడ్డితో, ఈటలతో ఆయనకున్న పంచాయితీ గూర్చి మాట్లాడుకుంటే మంచిదన్నారు.

Latest News