వాజపేయి సేవలు మరువలేనివి: ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్‌లో జయంతి వేడుకలు విధాత, వరంగల్: భారతరత్న అటల్ బిహారీ వాజపేయి దేశ అభివృద్ధి కోసం చేసిన చేసిన కృషి మరువలేనిదని బిజెపి వరంగల్ తూర్పు నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కొనియాడారు. వాజ్‌పేయి 98వ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అటల్ బిహారీ వాజపేయి చిత్రపటాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలోని కాశిబుగ్గ, శివనగర్,ఖిలావరంగల్, చింతల్, రంగశాయి పేటలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

  • Publish Date - December 25, 2022 / 04:59 AM IST

వరంగల్‌లో జయంతి వేడుకలు

విధాత, వరంగల్: భారతరత్న అటల్ బిహారీ వాజపేయి దేశ అభివృద్ధి కోసం చేసిన చేసిన కృషి మరువలేనిదని బిజెపి వరంగల్ తూర్పు నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కొనియాడారు.
వాజ్‌పేయి 98వ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అటల్ బిహారీ వాజపేయి చిత్రపటాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలోని కాశిబుగ్గ, శివనగర్,ఖిలావరంగల్, చింతల్, రంగశాయి పేటలో వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నేటి తరానికి వాజపేయి ఆదర్శప్రాయుడన్నారు. దేశ హితమే లక్ష్యంగా, రాజనీతిజ్ఞుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశ ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న వాజపేయి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు.

జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, పిట్టల కిరణ్, సిద్ధం నరేష్, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అల్లం నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధులు తాబేటి వెంకట్ గౌడ్, మార్టిన్ లూథర్, మాదాసి రాజు, కొప్పుల క్రాంతి, సీనియర్ నాయకులు. సముద్రాల పరమేశ్వర్, ఆకారపు మోహన్, పుప్పాల రాజేందర్ తరులు పాల్గొన్నారు.