Varshini Sounderajan | ఆ డైరెక్ట‌ర్ న‌న్ను హోట‌ల్‌కి పిలిచి బెడ్‌పై ప‌డుకోమ‌న్నాడు.. వ‌ర్షిణి షాకింగ్ కామెంట్స్

Varshini Sounderajan: తెలుగులో త‌మ అంద‌చందాల‌తో పాటు మాట‌ల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌యాంక‌ర్స్‌లో వ‌ర్షిణి సౌంద‌ర్‌రాజ‌న్ ఒక‌రు. హైద‌రాబాద్‌కి చెందిన వర్షిణి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ త‌ర్వాత ప‌లు వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఇక 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారిన ఈ అమ్మ‌డు సినిమాలో మంచి పాత్ర పోషించింది. ఈ సినిమా త‌ర్వాత ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన కూడా ఏ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకురోలేదు. అయితే 'పెళ్లి గోల' […]

  • Publish Date - August 9, 2023 / 08:52 AM IST

Varshini Sounderajan:

తెలుగులో త‌మ అంద‌చందాల‌తో పాటు మాట‌ల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌యాంక‌ర్స్‌లో వ‌ర్షిణి సౌంద‌ర్‌రాజ‌న్ ఒక‌రు. హైద‌రాబాద్‌కి చెందిన వర్షిణి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ త‌ర్వాత ప‌లు వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. ఇక ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా మారిన ఈ అమ్మ‌డు సినిమాలో మంచి పాత్ర పోషించింది.

ఈ సినిమా త‌ర్వాత ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన కూడా ఏ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకురోలేదు. అయితే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌‌లో కొన్ని సీజన్లు చేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది వ‌ర్షిణి. అయితే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిన కూడా వ‌ర్షిణికి పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు బుల్లితెర‌కి అడుగుపెట్టింది.

‘ఢీ’ షోలో మెంటర్‌గా సంద‌డి చేసిన వ‌ర్షిణి.. ‘పటాస్’ షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఈ షో వ‌ర్షిణికి బాగానే క‌లిసి వ‌చ్చింది. ఈ షో త‌ర్వాత వ‌ర్షిణికి చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. బుల్లితెర‌పై సుదీర్ఘ‌కాలం త‌న స‌త్తా చూపించిన వ‌ర్షిణి.. కామెడీ స్టార్స్ షో తర్వాత హోస్టింగ్‌కు దూరంగా ఉంటుంది.

మ‌ళ్లీ సినిమాల‌లో అడ‌పాద‌డ‌పా కనిపిస్తూ సంద‌డి చేస్తుంది. సుమంత్‌తో కలిసి ‘మళ్లీ మొదలైంది’లో లీడ్ రోల్ చేసిన వ‌ర్షిణి ఇటీవ‌ల విడుద‌లైన శాకుంతలం మూవీలో కూడా మెరిసింది. ఇక సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సంద‌డి చేస్తోన్న వర్షిణి సౌందరాజన్..త‌న ఘాటు అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఎక్కువ‌గా థైస్ అందాల‌తో పాటు ఎద అందాలు చూపించి క్రేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.

తాజాగా వ‌ర్షిణి కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పిన వ‌ర్షిణి.. ఒక‌సారి వెబ్ సిరీస్‌లో అవ‌కాశం ఉంద‌ని, దాని గురించి మాట్లాడాల‌ని ఓ ద‌ర్శ‌కుడు న‌న్ను హోట‌ల‌కి పిలిచాడు. అప్పుడు హోట‌ల్‌కి వెళ్ల‌గా, అప్పుడు ద‌ర్శ‌కుడు .. నువ్వు ఈ వెబ్ సిరీస్ లో చాలా బాగా సెట్ అవుతావ్ అని అన్నాడు.

అనంత‌రం న‌న్ను బెడ్‌పైకి తోసేసి బ‌ట్టలు విప్పి ప‌డుకోమ‌ని అన్నాడు. అప్పుడు భ‌యంతో హోట‌ల్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసి కారులో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాను అంటూ త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి చెప్పుకొచ్చింది వ‌ర్షిణి. ఈ అమ్మ‌డి కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.