(విధాత ప్రత్యేకం)
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు ఉన్న ప్రతికూల వాతావరణం, కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై తొలి నుంచి విధాత వేసిన అంచనాలు అక్షర సత్యాలయ్యాయి. ఎన్నికల్లో బీఆరెస్‌కు ఎదురు తిరిగే అంశాలపై విధాత వరుస కథనాలు ప్రచురించింది. వివిధ నియోజకవర్గాల్లో ప్రజల అసంతృప్తి ఏ విధంగా ఉన్నదో వరుస విశ్లేషణలు ఇచ్చింది. ఓటరు నాడిని తొలి నుంచీ పట్టుకున్నది.
రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై విస్పష్టంగా అది ‘బీఆరెస్ కుంగుబాటు’ అని తేల్చి చెప్పింది విధాత. ఎందుకంటే.. కేసీఆర్ కానీ, బీఆరెస్ నాయకులుగానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఘనతగా చాటుకున్నారు. నిజానికి అది తెలంగాణకు తెల్ల ఏనుగులా పరిణమించిందన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
అలాగే కొలువుల భర్తీ అటకెక్కిన విషయాన్నిస్పష్టం చేసింది. కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావడం పరీక్షలు రద్దు కావడం, పరీక్షలు రాసిన తరువాత పేపర్ లీకేజీల పేరుతో తిరిగి పరీక్షలు రాయాల్సి రావడంపై నిరుద్యోగుల్లో ఉన్న నిరసన వ్యక్తమైంది. పరీక్షలు వాయిదా వేయడంతో విద్యార్థిని ప్రవళిక సూసైడ్ తరువాత పెళ్లు బుక్కిన ఆగ్రహ జ్వాలలను ఎన్నికల వేళ కారుకు ట్రబుల్ అనే శీర్షికతో విధాత తెలియజేసింది. అలాగే గృహలక్ష్మి పథకంలో అమలులో జరిగిన లోపాలు ఎత్తి చూపుతూ 15 లక్షల దరఖాస్తులకు కేవలం లక్ష మందికే మంజూరు పత్రాలు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఊర్లల్లో ఇళ్ల లొల్లి అనే శీర్షిక తెలియజేసింది.
ఇలా జనంలో ఉన్న అసంతృప్తిని పసిగట్టిన విధాత ఎప్పటికప్పుడు విషయాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని తెలిపింది. రాష్ట్రంలో ఐటి దారుడులతో కాంగ్రెస్‌కే సానుబూతి వస్తున్న విషయాన్ని కూడా తెలియజేసింది. మరో వైపు ఐటి, ఈడి దాడులు ఒకే పార్టీ నాయకుల వ్యపారాలపై జరగడంతో బీజేపీ, బీఆరెస్‌ల మధ్య రహస్య అవగాజహన ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది.
దీనిని పసిగట్టిన విధాత కారు…కాంగ్రెస్… కాషాయం… ఏమిటా కథ అనే శీర్షికను రాసింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎప్పటికప్పడు తెలియజేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలను తెలియజేసింది. క్షేత్ర స్థాయిలో చేసిన అద్యయనాన్నిక్రోడీకరించి ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటున్నారో తెలియ జేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందనే విషయాన్ని తెలియజేసింది.