Vijay Devarakonda | అన‌సూయ‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గొడ‌వ మ‌ళ్లీ మొద‌లా..!

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల యాంక‌ర్ అనసూయ మ‌ధ్య జ‌రిగిన కోల్డ్ వార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని టార్గెట్ చేస్తూ అన‌సూయ కామెంట్స్ పెట్ట‌డంతో ఆమెని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. అర్జున్ రెడ్డి సినిమా నుండి వివాదం మొద‌లు కాగా, ఇటీవ‌ల ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండ‌డం కూడా అన‌సూయ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. […]

  • Publish Date - August 10, 2023 / 01:55 AM IST

Vijay Devarakonda:

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల యాంక‌ర్ అనసూయ మ‌ధ్య జ‌రిగిన కోల్డ్ వార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని టార్గెట్ చేస్తూ అన‌సూయ కామెంట్స్ పెట్ట‌డంతో ఆమెని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్.

అర్జున్ రెడ్డి సినిమా నుండి వివాదం మొద‌లు కాగా, ఇటీవ‌ల ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండ‌డం కూడా అన‌సూయ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఈ విష‌యంలో కూడా ఆయ‌నపై ఫైర్ అయింది.కొద్ది రోజుల పాటు అన‌సూయ‌- విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య కోల్డ్ వార్ జ‌ర‌గ‌గా, ఇటీవ‌ల వాట‌న్నింటిని ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది అన‌సూయ‌.

‘అర్జున్ రెడ్డి’ ఘటన తర్వాత త‌న‌పై ట్రోల్స్ చేయ‌డం వెనుక విజయ్ హస్తం కూడా ఉందని అనుకున్నానని అన‌సూయ చెప్పుకొచ్చింది. అయితే తాను మాన‌సిక ప్ర‌శాంత‌త కోరుకుంటున్న‌ట్టు తెలిపిన అన‌సూయ‌.. వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామని అనుకుంటున్నానని ఓ సంద‌ర్భంలో వెల్లడించింది.

Anasuya | మరోసారి బోల్డ్ పాత్రలో అనసూయ.. ఈ మ‌ధ్య ఇలా త‌యారైందేంటి?

వివాదాల‌న్నింటిని పక్కనపెట్టి జీవితంలో ముందుకు సాగాలని తాను అనుకుంటున్నానని అన‌సూయ పేర్కొంది. అయితే వివాదంపై చాలా సార్లు అన‌సూయ స్పందించిన కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం ఒక్క‌సారి ఈ వివాదంపై నోరు విప్ప‌లేదు. తాజాగా ఖుషీ ట్రైల‌ర్ లాంచింగ్ కాగా, ఈ లాంచింగ్ ఈవెంట్‌లో ఓ మీడియా ప్రతినిధి అనసూయతో అసలు వివాదం ఏంటి.. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అని అడిగారు.

Anasuya | నో లిమిట్స్.. భర్తతో కలిసి అనసూయ ఆగమాగం! షేకవుతున్న సోషల్ మీడియా

దానికి స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఏమో ఆ వివాదం నాకు తెలియదు.. గొడ‌వ ప‌డే వాళ్ల‌నే అడ‌గండి అంటూ సింపుల్‌గా స‌మాధానం ఇచ్చారు. అస‌లు సోష‌ల్ మీడియాలో ఏం న‌డుస్తుందో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పుకొచ్చారు.

ఇక విజయ్ దేవ‌ర‌కొండ తన ప్రేమ పెళ్లి గురించి కూడా స్పందిస్తూ.. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి దొరకాలి కదా. ఇంకా దొరకలేదు. మరో రెండు మూడు ఏళ్లలో పెళ్లి చేసుకుంటా అంటూ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల‌తో స‌త‌మతం అవుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషీతో అయిన మంచి హిట్ కొడ‌తాడా అనేది చూడాలి.

Anasuya Bharadwaj Vs Vijay Devarakonda | అనసూయ విజయ్‌ను మళ్లీ కెలికింది.. మంట మొదలైంది

Anasuya Bharadwaj | రోజురోజుకి బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తున్న అన‌సూయ‌.. కెమెరాకి ద‌గ్గ‌ర‌గా అందాలు చూపిస్తూ రచ్చ‌