Viral video | ఆకాశంలో అందానికి మెరుగులు.. స్కై డైవింగ్ చేస్తూ 10,000 ఫీట్ల ఎత్తులో మేక‌ప్‌

అమెరికాకు చెందిన న‌టి మ‌క్కెన్నా నైప్ స్టంట్‌ ఇన్‌స్టాలో వీడియో వైర‌ల్ .. 5 ల‌క్షల మంది వీక్ష‌ణ‌ విధాత‌: కొంద‌రు న‌లుగురు న‌డిచిన దారిలో న‌డువ‌రు. ప్రత్యేక దారులు వేసుకుంటారు. నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం కంటే ప‌రుగెత్తి పాలు తాగ‌డం బెట‌ర్ అనుకుంటారు. కొన్నాళ్లు బ‌తికినా స‌రే త‌మ స‌త్తా ప్ర‌పంచానికి చాటాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. ఇందుకు ఎంత సాహ‌స‌మైనా (viral video) చేస్తారు. ఈ కోవ‌కు చెందిన‌దే అమెరికాకు చెందిన న‌టి మ‌క్కెన్నా నైప్‌. సోష‌ల్ […]

  • Publish Date - May 13, 2023 / 05:50 AM IST
  • అమెరికాకు చెందిన న‌టి మ‌క్కెన్నా నైప్ స్టంట్‌
  • ఇన్‌స్టాలో వీడియో వైర‌ల్ .. 5 ల‌క్షల మంది వీక్ష‌ణ‌

విధాత‌: కొంద‌రు న‌లుగురు న‌డిచిన దారిలో న‌డువ‌రు. ప్రత్యేక దారులు వేసుకుంటారు. నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం కంటే ప‌రుగెత్తి పాలు తాగ‌డం బెట‌ర్ అనుకుంటారు. కొన్నాళ్లు బ‌తికినా స‌రే త‌మ స‌త్తా ప్ర‌పంచానికి చాటాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. ఇందుకు ఎంత సాహ‌స‌మైనా (viral video) చేస్తారు. ఈ కోవ‌కు చెందిన‌దే అమెరికాకు చెందిన న‌టి మ‌క్కెన్నా నైప్‌.

సోష‌ల్ మీడియాలో ఆమెకు పెద్ద సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆమె చేసిన‌ సాహ‌స వీడియోలు కొన్ని సోష‌ల్‌మీడియాలో చ‌ర్చినీయాంశంగా మారాయి. ఆమె వీడియోల ప్ర‌త్యేక‌త ఏమిటంటే స్కై డైవింగ్ లో వెర్రి విన్యాసాలు చేస్తూ ఉంటుంది.

గాలిలో 10 వేల ఫీట్ల ఎత్తులో మేక‌ప్ ఎలా వేసుకోవాలో చేసి చూపించింది. బ‌హుషా గాలిలో మేక‌ప్ వేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి కావ‌చ్చు. అందుకే ఆ వీడియో ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేయ‌గా 5 ల‌క్ష‌ల‌పై చిలుకు వ్యూస్ వ‌చ్చాయి.

సాహ‌స స్టంట్‌పై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

వీడియోను వీక్షించిన ప‌లువురు నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు పెట్టారు. న‌వ్వు ధైర్య సాహ‌సివి.. స్కై డైవింగ్ తో అంద‌రినీ న‌లిపేశావు. ఈ స్టంట్‌తో ఇన్‌స్టాలో ఉన్న అంద‌గ‌త్తెల‌ను చంపేశావు.. వావ్‌.. గ్రేట్‌.. షీ టూ ఫ‌న్నీ.. ధైర్య‌శాలివి న‌వ్వు.. సాధ్యం కాని స్టంట్ ఇది.. ఇలా ప‌లు ర‌కాలుగా ఆమెను సాహ‌సాన్ని ప్ర‌శంసించారు.